Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Durgamma Festivals: ధూoధాంగా దుర్గమ్మ ఉత్సవాలు

–నెలరోజుల పాటు అంగరంగ వైభ వంగా దుర్గమ్మ వేడుకలు
–జూలై 6వ తేదీ నుంచి ఆగష్టు 4 వరకూ పడగ వాతావరణం
–చీరె, సారె, పూజ సామగ్రి సమ ర్పించనున్న భక్తజనం

Durgamma Festivals: ప్రజాదీవెన, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగిన తర్వాత జరుగుతోన్న అమ్మవారి ఉత్సవాలకు ఎన్డీఏ ప్రభుత్వం (NDA Govt) అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తోంది. విజయవాడ ఇంద్ర కీలాద్రిపై ఆషాడ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీ. ఆషా డమాసంలో ఆడపిల్లలు పుట్టింటికి చేరుకుంటారని అలాగే దుర్గమ్మను కూడా తమ ఇంటి ఆడపడుచుగా భావించి చీరె,సారె, పూజ సామగ్రి సమర్పించనున్నారని నానుడి. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఉత్సవాల కు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ, చుట్టుపక్కల రాష్ట్రాల ప్రాంత ప్రజలు కూడా భారీగా భక్తులు తరలివచ్చి అమ్మ కు మొక్కులు చెల్లించుకుంటారు.

ఇలా అమ్మవారికి సారె పెట్టేందుకు వచ్చే భక్త బృందాలకు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక క్యూలైన్లలో దర్శనానికి ఏర్పాట్లు చేశారు ఆల య అధికారులు. గర్భగుడిలో ఉన్న దుర్గమ్మను (Durgamma) దర్శించుకుని ఆ తర్వా త మహా మండపంలో ఉన్న ఉత్స వ మూర్తికి సారె సమర్పించిన తర్వాత తమతో పాటూ వచ్చిన మిగిలిన భక్తులకు కూడా పసుపు కుంకుమ ఇచ్చిపుచ్చుకుంటారు. నెల రోజులు పండుగ వాతావరణం ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు, భవానీ దీక్షలు, (Dussehra celebrations and Bhavani Deekshas) శ్రావణమాసంలో నిర్వహించే ఉత్సవాల తర్వాత స్థానం ఆషాడమాసోత్సవాలదే పై చేయి. ఈ ఏడాది జూలై 6 న ప్రారం భమయ్యే ఆషాడమాసం ఆగష్టు 4 న ముగుస్తుంది. ఈ నెల రోజులు కొండపై పండుగ వాతావ రణమే దేదీప్యమానంగా వెలుగొం దుతోం దని భక్తుల విశ్వాసం. భక్త బృందా ల సారె సమర్పణల, వారాహి నవ రాత్రులు, శాకంబరీ ఉత్సవాలతో సహా దుర్గమ్మకి కూడా బోనాలు సమర్పిస్తారు. ఈ మేరకు ఆలయ మహా మండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టిస్తారు, సారె సమర్పించేందు కు భారీగా భక్తులు తరలివస్తారన్న అంచనా మేరకు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈవో కేఎస్‌ రామరావు (EO KS Rama Rao) అధికారులతో పలు మార్లు సమీక్ష సమావేశాలు నిర్వ హించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆషాఢ మాసోత్సవాలు, వారాహి నవ రాత్రులు, శాకంబరీ ఉత్సవాలతో పాటూ ప్రతి శుక్రవారం, శనివారం భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ఈ మేరకు కీలక ప్రాంతాల్లో అదన పు సిబ్బందిని నియమిస్తు న్నామ ని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా శాకాంబ రి ఉత్సవాలు సైతం ఆషా డమా సంలోనే శాకాంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిoచడం ఆన వాయితీ. ఈ మేరకు కూరగాయ లు, పండ్లు, ఆకు కూరలతో అమ్మ వారిని విశేషంగా అలంకరిస్తారు. దేశమంతా పచ్చగా ఉండాలని, పాడి పంటలతో కళకళలాడాలని అమ్మను ప్రార్థిస్తూ శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. శాకాంబరి అమ్మవారి (Shakambari Ammavari)గురించి దేవీభాగ వంతో పాటూ మార్కండేయ పురాణంలోనూ ఉంది. 2017 నుం చి ప్రారంభమైన సారె సమర్పణ 2016 లో కృష్ణానది పుష్కరాలు జరిగిన ఏడాది నగరానికి చెందిన భక్తుల బృందం అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి కైవల్యాకృతి సేవా సమితి పేరుతో మేళతాళాలతో తరలి వెళ్లి పట్టు చీర, పూలు, పండ్లు, వివిధ రకాల స్వీట్లు, పసుపు, కుంకుమ సమ ర్పించారు. 2017లోనూ ఈ సేవా సమితి అమ్మవారికి సారెను సమ ర్పించాలని నిర్ణయించి ఆలయ ఈవోని సంప్రదించారు. అప్పటి నుం చి దుర్గమ్మకు సారె సమర్పించే కార్యక్రమాన్ని దేవస్థానం ఆధ్వ ర్యంలో వైభవంగా నిర్వహించడం ప్రారంభించారు.