Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gopaldas Agarwal: మహారాష్ట్రలో బీజేపీకి ఝలక్ ..కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన విదర్భ సీనియర్ నేత..

Gopaldas Agarwal: ప్రజా దీవెన మహారాష్ట్ర: మహారాష్ట్ర (Maharashtra)లో బీజేపీ (BJP)కి ఊహించని భారీ షాక్‌ తగిలింది. విదర్భ సీనియర్ నేత (Senior leader of Vidarbha) గోపాల్‌దాస్ అగర్వాల్ (Gopaldas Agarwal) కాంగ్రెస్‌ (Congress) గూటికి తిరిగి వచ్చారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

 

గతంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడైన గోపాల్‌దాస్ వరుసగా మూడు సార్లు 2004, 2009, 2014లో గోండియా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఆయన చేరారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వినోద్ ఎస్‌ అగర్వాల్‌ (Vinod S Aggarwal) చేతిలో ఓడిపోయారు.