Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hibiscus Tea: మందార పువ్వుల టీ గురించి మీకు తెలుసా

Hibiscus Tea: నిజానికి మన ఇంటి ముందు అందంగా పూలు పూసే మందార మొక్కలో (Hibiscus)పుష్కలమైన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా మందార పూలలో ఔష‌ధ గుణాలు బెండుగా ఉన్నాయి. వీటిని జుట్టు పెరుగుద‌లకు వాడుతుంటారు. ఇలా మందార పూల వాడకంతో జుట్టు అందంగా, ఒత్తుగా పెరుగుతుందని ఇప్పటికే చాలా మంది వాడుతున్నారు.. మందార పూలు కేవ‌లం జుట్టు పెరుగుద‌ల‌లోనే కాకుండా మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు తెలుపుతున్నారు. ఈ మందారపూల టీని (Hibiscus Tea) ప్రతిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇక మందార పూలతో తయారు చేసిన టీ రోజూ తీసుకోవటం వల్ల గుండె సమస్యలు దూరం చేసుకోవచ్చు.. అంతే కాకుండా మీరు అల్జీమర్స్, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ టీతో (Hibiscus Tea)మంచి ఉపశమనం లభిస్తుంది ఆయుర్వేద నిపుణులు అంటున్నారు . ఇక రక్తపోటును తగ్గించడంలో ఈ టీ చాలా మేలు చేస్తుంది. అలాగే ఈ టీ కొలెస్ట్రాల్ (Cholesterol) స్థాయిలను నియంత్రించడంలో చాల సహాయ పడుతుంది..

మందార టీ కోసం ఎండిపోయిన మందారపూల రెమ్మలను (Hibiscus shoots) రెండు, మూడు స్పూన్లు తీసుకోవాలి. వీటిని రెండు కప్పుల నీటిలో వేసి ఐదు నిమిషాలపాటు ఇక మరిగించాలి. అంతే మందారపూల టీ తయారైనట్లే. వీటిని వడబోసి.. కాస్త తేనె, నిమ్మకాయ రసం కలుపుకుని తాగేయాలి. ఇలా తయారు చేసుకున్న అనంతరం మందారపూల టీని ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. ఇక శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. మనం తీసుకునే కార్బో హైడ్రేట్స్ ని కూడా ఫ్యాట్స్ గా మారకుండా అడ్డుకుంటుంది. ఈ క్రమంగా బరువు తగ్గించడంలో బాగా తొడ్పడుతుంది.

ఇక హై బీపీ ఉన్నవారు కూడా రెగ్యులర్ గా ఈ మందార టీ (Hibiscus tea) తాగాలని నిపుణులు తెలుపుతారు.. మందార టీ తాగడం వల్ల బీపీ చాలా వరకు కంట్రోల్ (control) లో ఉంటుంది. ఇక రెగ్యులర్ గా తాగడం వల్ల హై బీపీ కి ఇక మీరు మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదని నిపుణులు చెబుతున్నారు.ఇక మందార పువ్వు టీ కాలేయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ టీ శరీరంలోని వివిధ రకాల టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. ఇలా మందారపూల టీలో యాంటీడిప్రసెంట్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. అలాగే మన బాడీలో యాంక్సైటీ, డిప్రెషనల్ లాంటివి తగ్గించడంలో కూడా సహాయం చేస్తాయి. అలాగే చర్మం, జుట్టు సంరక్షణలో (Skin and hair care) కూడా తోడ్పడుతాయి.