–బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చిత్తశుద్ధి చూపించాలి
–బిజెపి నిర్లక్ష్యం వహిస్తోంది బీసీ లను బిఆర్ఎస్ మోసం చేసింది
–బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మ న్ టి.చిరంజీవులు
All-Party Delegation : ప్రజా దీవెన,హైదరాబాద్: నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమ లుకై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బిల్లు ఆమోదింప చేయా లని బిసి ఇంటలెక్చువల్స్ ఫోరం చై ర్మన్ టీ చిరంజీవులు అన్నారు. లేని పక్షంలోబీసీలం పెద్ద ఎత్తున ఉద్య మం చేస్తామని హెచ్చరించారు. శు క్రవారం మధ్యాహ్నం ప్రెస్ క్లబ్ లో పలు బీసీ సంఘాల నేతలతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం లో మాట్లాడారు. అన్ని పార్టీలు బీ సీల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించ డం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, బిజెపిలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో బిల్లు ఆమోదింప చేయా లని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభు త్వము బీసీలకు 42 శాతం రిజర్వే షన్ బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపి ఇప్పటికీ మూడు నెలల సమయం కావస్తున్నా కేంద్రంలో కదలిక లేద ని ఆయన విమర్శించారు. కేంద్ర ప్ర భుత్వానికి బిల్లు పంపిన అనంత రం ఏడుసార్లు క్యాబినెట్ మీటింగ్ జరిగిందని ఈ బిల్లును మాత్రం ప ట్టించుకోలేదని ఆయన విమర్శించా రు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రా ష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్ష ణమే స్పందించి వేగంగా అఖిలపక్షా న్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని లేని పక్షం లో బీసీలు అంతా కలిసి ఉద్యమి స్తామని హెచ్చరించారు .ప్రధాని న రేంద్ర మోడీ అపాయింట్మెంట్స్ ఇవ్వ కపోతే ధర్నా చేయాలని సూచించా రు. 42 శాతం రిజర్వేషన్లు పూర్తిస్థా యిలో అమలు చేసేందుకు చిత్తశు ద్ధితో పోరాటం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్రంలో బిజెపి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తేవడంలో కేవలం ఎనిమిది రోజుల్లోనే చట్టం చేసి దేశవ్యాప్తంగా అమలు చేసిందని అ దే బీసీల బిల్లు విషయంపై పూర్తిగా నిర్లక్ష్యగా వ్యవహరిస్తుందని ఆరో పించారు.
బీసీ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవా ల ని అందుకు బిజెపి కాంగ్రెస్ లు కలి సి కృషి చేయాలని కోరారు. కోర్టు తీర్పులు కూడా బీసీలకు ప్రతికూ లంగా వస్తున్నాయని ఆవేదన వ్య క్తం చేశారు. రిజర్వేషన్ల పరిరక్షణ 9వ షెడ్యూల్ లో చేర్చడం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. రా ష్ట్ర ప్రభుత్వం జారీ చేసే రిజర్వేషన్ల జీవోలు కోర్టులో నిలబడవని తెలి పారు. భారత రాజ్యాంగంలో రిజ ర్వేషన్లు మౌలిక సూత్రాలకు అను కూలమే కాబట్టి 9వ షెడ్యూల్లో పె డితే కోర్టులు సమీక్షించమని చెప్పా రు.కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో ఇ చ్చిన హామీ మేరకు కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయా లని అందుకు ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జాతీయ బీసీ సం క్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ బీసీ పొలి టికల్ ఫ్రంట్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు చామకూర రాజు, కె వి గౌడ్, పాలకురి అశోక్, చెన్న శ్రీకాంత్ ఒంటెద్దు నరేందర్, ఘోర శ్యామ్, శ్రీనివాస్, దుర్గయ్య గౌడ్, అవ్వారు వేణు, కొండల్ గౌడ్, నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్, బైరు శే ఖర్, ఆయిలి వెంకన్న గౌడ్, కుల్క చర్ల శ్రీనివాస్, విక్రమ్, ఎర్ర మాద వెంకన్న, రాపోలు జ్ఞానేశ్వర్ తది తరులు పాల్గొన్నారు.