IPS Transfers: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ (telangana) రాష్ట్రంలో 8మంది ఐపీఎస్‌లను బదిలీ (IPS Transfer) చేస్తూ రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (shanthi kumari) సోమవారం ఉత్త ర్వులు జారీ చేశారు. గత నెలలో రాష్ట్రవ్యా ప్తంగా పెద్దఎత్తున ఐపీఎస్‌ల బదిలీలు (IPS Transfer) జరగగా తాజా మరికొంత మందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. కొత్తగూ డెం ఓఎస్‌డీగా పరితోశ్ పంకజ్, ములుగు ఓఎస్‌డీగా గీతే మహేశ్ బాబా సాహెబ్, గవర్నర్ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్ నియమితులయ్యా రు.సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా కాంతి లాల్ సుభాశ్, వేములవాడ ఏఎస్పీ గా శేషాద్రిని రెడ్డి, భద్రాచలం ఏఎస్పీ గా అంకిత్ కుమార్, ఏటూరునాగా రం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ, భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమా ర్‌ను నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. గత నెలలోనూ పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు, పలుజోన్లకు డీసీపీలను (dcp) బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.