–కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కెసిఆర్ సృష్టించినవే
–మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
Jagadish Reddy:ప్రజా దీవెన, సూర్యాపేట: పోరాడి రాష్ట్రాన్ని సాధించి అధికారం చేపట్టిన 2014 నుంచి 2023 వరకు సుమారు 10 ఏండ్ల పాలనలో అన్ని రంగాల అభివృద్ధితో పాటు ఆడ పిల్లలు ఆత్మ గౌవరం పెంచిన ఘ నత బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) కే దక్కుతుం దని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagadish Reddy)పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు అందులో భాగమేనని, అంతేకాకుండా అత్య ధికంగా సంక్షేమ పథకాలు (Welfare schemes) మహి ళల పేరిట అందించిన ఘనత కూడా ఆయనదే అన్నారు. సోమ వారం నియోజకవర్గంలో సూర్యా పేట మున్సిపాలిటీ, రూరల్ మండలం లో 166, అలాగే చివ్వెంల మండలంలో 92 కల్యాణలక్ష్మి, షాది ముబారక్లకు సంబంధించిన 258 చెక్కులను చెక్కలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కసిసి పంపినీ చేసి మా ట్లాడారు. ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకున్న కేసీఆర్, ఆనాటి సమాజంలో ఆడపిల్లలు కుటుంబానికి భారం కాదు వరంగా భావించాలని, ముందుచూపుతో పెట్టిన సంక్షేమ పథకాలే నేడు అందరికి అండగా నిలుస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ వస్తే కేసీఆర్ ఇస్తున్న లక్షతో పాటు తులం బంగారం అదనంగా వస్తదని ఆశపడి వాళ్లకు అధికారం చేపట్టి ఇప్పుడు బాధ పడుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు అందిం చడం ఇన్ని రోజులు ఆలస్యమైతే మేడు కూడా నిజమేనని నమ్మి నామని తెలిపారు. ఇన్ని రోజుల అక్క చెల్లెళ్ల ఆశలు అడి యాశల య్యాయని, చివరికి కేసీఆర్ ఇచ్చిం ది దక్కయిందని అన్నారు. పథకాల అమ లుతో పాటు 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ (congrees) ప్రభుత్వం పూర్తి గా విఫలమైంద న్నారు. ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా చెక్కులు అందుకున్న అక్కా చెల్లెళ్లకు శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్, ఆయా వార్డు కౌన్సి లర్లు, అధికారులు పాల్గొన్నారు.
రుణమాఫీ, కాళేశ్వరం (Loan Waiver, Kaleshwaram) ఎత్తిపో తలపై అస్పష్టత… సీఎం రేవంత్ రెడ్డి ప్రక టించిన రుణమాఫీతో పా టు కాళేశ్వరం నీటి ఎత్తిపోతల అం శాల పై స్పష్టత లేదని, దీని పై ప్రజ లు పెదవి విరుస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగ దీష్ రెడ్డి ఆరోపించారు. సోమ వా రం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో మాట్లా డుతూ రాష్ట్రంలో దేవుడు కరు ణించి సమృద్ధిగా వర్షాలు కురుస్తు న్నా యని, అందకు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల వద్ద లక్షల క్యూసెక్కుల నీరు వృధా సముద్రం పాలవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నీటిని ఎత్తిపోయకుండా నిర్ల క్ష్యంతా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క బటన్ నొక్కితే రెండు టిఎం సిల నీటిని పంపుల ద్వారా ఎత్తిపోసే అవకాశం ఉన్న అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీటిని కాలువల ద్వారా రైతులకు ఎందుకు అందించడం లేదో ముఖ్యమంత్రి, ఇరిగే షన్ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ (demand) చేశారు. వ్యవసాయం, సాగునీటి అంశాల పై సీఎం సహా ఎవ్వరికీ అవగాహన లేదని, గోదావరి జలాలు రైతులకు అందిచే అవకాశం ఉన్నా కావాలనే రైతుల పట్ల కక్ష పూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.