Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

JournalistRoundtablemeating : జర్నలిస్టులపై కేసు నమోదుపై అఖి లపక్షం మండిపాటు, ముక్తకంఠంతో ఖండించిన రౌండ్ టేబుల్ సమావే రౌండ్ టేబుల్ సమావేశం

JournalistRoundtablemeating ప్రజా దీవెన,ఖమ్మం: యూరియా కొ రతతో రైతులు ఎదుర్కొంటున్న స మస్యను కవరేజ్ కోసం వెళ్ళిన ఖ మ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబశివరా వు, సాక్షి పత్రిక ఎడిటర్ ధ నుంజయ్ రెడ్డిలపై కేసు నమోదు చేయ డా న్ని అఖిలపక్ష పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయి. తక్షణమే టీ న్యూస్ బృందంపై సాక్షి ఎడిటర్ పై కేసును తక్షణమే ఉపసం హరిం చుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో టియుడబ్ల్యూజే టీజేఎఫ్ ఖమ్మం జిల్లా కమి టీ ఆధ్వర్యంలో జర్నలిస్టులపై అక్రమ కేసుల అంశంపై టీజిఎ ఫ్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి చిర్రా రవి సమన్వయకర్తగా రౌండ్ టేబు ల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, సిపిఐ, కాంగ్రెస్, సిపి ఎం, బిఆర్ఎస్, టీయూడబ్ల్యూజే ఐ సి యు , న్యూడెమోక్రసీ ఇతర ప్ర జా సంఘాలను నేతలు హాజర య్యారు.

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలను పాలక వర్గం దృష్టికి తీసుకెళ్లేం దుకు వార్త క వరేజ్ కి వెళ్లిన వారి జర్న లిస్టులపై ప్రభుత్వం నిర్బం ధాలు కొనసాగించడం తగదన్నారు. టీవీ ఛానల్ ను పత్రికలను భజన మీడియాగా మార్చుకున్నందుకు పాలకవర్గం ఇలాంటి నిర్బం ధాలు ప్రయోగిస్తుందని విమర్శలు చేశారు. కేంద్రంలో బిజెపి అధి కారంలోకి వచ్చాక జర్నలిస్టుల పై రచయితలపై దాడులు మరింత పెరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొం టున్న సమస్యను వాస్తవమైన విషయాన్ని వార్తా కథనాలుగా రాస్తే తప్పేంటని ప్రశ్నించారు.

పాలకవర్గాలు మారిన జర్నలిస్టుల పై నిర్బంధాలు యధావిధిగా కొ నసాగుతున్నాయని భవిష్యత్తులో జ ర్నలిస్టులపై కేసు నమోదు చేయా లంటే భయపడేలా ఐక్యంగా ముం దుకు సాగాలని పిలు పునిచ్చారు. సాంబ, నాగరాజు రాజేష్, సాక్షి ఎ డిటర్ ధనుంజయ్ లపై కేసులు ఉ పసంహరించుకోకపోతే మరోసారి ప్రత్యక్ష ఆందోళ నకు నిర్వహించాల ని తీర్మానించారు.

*మీడియాపై అణచివేత ధోరణి మానుకోవాలి:*

సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కా ర్యదర్శి పి రంగారావు మాట్లాడు తూ స్వతంత్రంగా ఎదగాలనే మీడి యా ఆలోచన నిర్బంధల ద్వారా లోపర్చుకోవాలని ఆలోచనను ప్రభు త్వం మానుకోవాలని అన్నారు. యూరియా వార్తలను వాస్తవమైన విషయాలను కవరేజ్ చేసినందుకు రాజ్య ద్రోహం కేసు నమోదు చేయ డం అన్యాయమన్నారు. బిజెపి పా లిత ప్రాంతాలలో జర్నలిస్టులపై దా డులు మరింత పెరిగాయని ప్రస్తు తం కాంగ్రెస్ కూడా అదే అదే ధోర ణితో వ్యవహరిస్తుందని అన్నారు. కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

*మీడియాకు స్వేచ్ఛ లేకుండా చే స్తున్నారు:*

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు బి హేమంతరావు మాట్లాడుతూ గ త ప్రభుత్వం హయంలో కొనసాగిన నిర్బంధాలే కాంగ్రెస్ హయాంలో కూ డా కొనసాగుతున్నాయన్నారు. మా కు వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసు లు నమోదు చేస్తామని బెదిరించ డం సరికాదన్నారు.బిజెపి పాలిత ప్రాంతంలో దాడులు ఎక్కువయ్యా యని, తెలంగాణలో యూరియా సమస్యను రాసిన నేతలపై రాజ ద్రోహం కేసులు పెట్టడం ప్రజాస్వా మ్యం కాదన్నారు.

*అక్రమ కేసులు మంచి సంప్రదాయం కాదు:*

కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వల దుర్గా ప్రసాద్ మాట్లాడు తూ జర్నలిస్టులపై మా ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడద ని, ఒకవేళ అక్రమ కేసులు బనాయి స్తే అది మంచి సంప్రదాయం కాదని డిసిసి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పి. దుర్గ ప్రసాద్ అన్నారు. గోపవరం లో యూరియా సమస్యను ప్రభు త్వానికి వ్యతిరేకంగా చెప్పాలని అ త్యుత్సాహంతో రైతులను రెచ్చ గొ ట్టినట్టు మా దృష్టికి వచ్చిందని రైతు స్వ హస్తాలతో రాసి ఇచ్చిన ఫిర్యా దు మేరకు స్టేషన్లో కేసు నమోదు అ యిన విషయం తెలిసిందని అన్నా రు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ లో ఉన్న జర్నలిస్టుల పక్షానే తమ పార్టీ ఉంటుందని పేర్కొన్నారు.

 

జర్నలిస్టులపై వెంటనే కేసు నమోదు చేసే పద్ధతి వద్దు:

ఐజెయు రాష్ట్ర కార్యదర్శి రామ్ నా రాయణ మాట్లాడుతూ జర్నలి స్టు లు అనగానే వెంటనే కేసు నమోదు చేసి చర్యలు మానుకోవాలన్నారు. జర్నలిస్టులపై కేసు కుటుంబం మీ దనే ప్రభావం ఉంటుందని,కానీ దా ని ప్రభావం అధికార పార్టీకి అధికా రులకు భవిష్యత్తులో తీవ్ర పరిణా మాలు ఉంటాయని హెచ్చరించా రు. యూరియా కోసం మంత్రీ తు మ్మల నాగేశ్వరరావు చేస్తున్న కృషి ని స్వాగతిస్తున్నానని అదే సంద ర్భంలో కేసులు నమోదు చేయడా న్నీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

*యూరియా కొరత అంశాన్ని కప్పిపుచ్చుకునేందకె కేసులు:*

బిఆర్ఎస్ నగర అధ్యక్షులు పగ డా ల నాగరాజు మాట్లాడుతూ సకాలం లో రైతులకు యూరియా అందించే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ స ర్కార్ పూర్తిగా విఫలం అయిందని వాస్తవమైన విషయాలను ప్రసారం చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అడ్డుకునేందుకే మీడియా ప్రతినిధు లపై కక్ష సాధింపు కేసులో నమోదు చేసిందని ఆరోపించారు.

*100శాతం కుట్రపూరితమైన కేసు నమోదు*... అడ్వకేట్ జె ఎ సి చైర్మన్ తిరుమల రావు మా ట్లా డుతూ రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న జర్నలిస్టుపై 100 శాతం కుట్రపూరిత మైన కేసు నమోదు చేశారని అడ్వకేట్ చేసి చైర్మన్ తిరుమల రావు అన్నారు. గవర్నర్ ,దేశ ప్రధానిలపై దాడి చేస్తే నమోదు చేసే సెక్షన్స్ పెట్టి చట్ట విరు ద్ధంగా నిర్బంధించే కుట్ర ప్రభుత్వం వైపు నుంచి జరిగిందని తక్షణమే కేసు ఉపసంహరించుకోవాలని డి మాండ్ చేశారు.

*దుర్మార్గమైన చర్య, అధికారం లోకి రాగానే మారిపోతారా*

సిపిఎం కళ్యాణ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యూరియా సమ స్య కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులు పై కే సు నమోదు చేయడం దుర్మార్గమైన చర్యని సిపిఎం నాయకులు కళ్యాణ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రతి పక్షం నుండి అధికారంలోకి రాగానే జర్నలిస్ట్ ను నిర్బంధిస్తారా అని ప్రశ్నించారు. సిపిఎం సిఐటియు నిరంతరం జర్నలిస్టుల పక్షాన ఉం టుందని తెలిపారు

*ఉన్నది ఉన్నట్లు రాస్తే ఉలుకెందుకు* …ఐ జె యు రాష్ట్ర నాయ కులు మాటేటి వేణుగోపాల్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు ఏనుగు వెంక టేశ్వరరావు, మైసా పాపారావు లు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యా ల ను ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు వివ రిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలి క్కిపడుతుందని ఐజెయు నేతల ప్రశ్నించారు. బా ధ్యత కలిగిన జర్న లిస్టులకు వృత్తిపరమైన అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని తిరుగుబా టు ఉదృతం చేస్తామని వారు పే ర్కొ న్నారు. జర్నలిస్టుకు ఎక్కడ అ న్యాయం జరిగిన తుది పోరుకు ఐ జె యు సిద్ధంగా ఉంటుందని వారు తెలిపారు.

*జర్నలిస్టుల రక్షణ చట్టం తేవాలి:* …స్థంబాద్రి మ్యూచివల్ కో – ఆ పరేటివ్ హౌసింగ్ సొసైటీ చైర్మన్కనకం సైదులు మాట్లాడుతూ వాస్తవమైన విషయాలు టెలికాస్ట్ చేస్తే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తు న్నానన్నారు. పోలీసులు ఇతర రా జకీయ నాయకులు స్నేహపూరితం గా వ్యవహరిస్తూ దాడులు కేసులు పెడుతున్నారని. తక్షణమే జర్నలి స్టుల రక్షణ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

*ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వానికి నష్టం...* టియుడబ్ల్యూఏజే కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ మా ట్లా డుతూ వార్త కవరేజీ విషయంలో ఏకపక్షంగా ఆలోచిస్తూ జర్నలిస్టుల పై కేసులను నమోదు చేయడం సరై నది కాదని దీని పర్యావసనాలు రా ష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంద ని హెచ్చరించారు.

అధికార అహంకారంతో జర్నలిస్టు లపై కేసుల నమోదు చేస్తే తిరు గుబాటు బలం గా ఉండేలా ఐక్య ఉ ద్యమాలకు సిద్ధం కావాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మోహన్ రావు, సిపిఐ జిల్లా సహా య కార్యదర్శి జితేందర్ రెడ్డి, క్లెయిమెంట్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుల నరేందర్, పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ జర్న లిస్టులకు మద్దతుగా మాట్లాడారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారిలో టీ జె ఎఫ్ టెంజు జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీ కాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, ఐ జె యు రాష్ట్ర నాయకులు మురారి ఎలెక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు మామిడాల భూపాల్, కార్యదర్శి మహేం దర్, ఐ జె యు నగర అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాస్ నగర కార్య దర్శి నామా పురుషోత్తం,టి జె ఎఫ్ జిల్లా ఉపా ధ్యక్షులు దుంపటి భాస్కర్, మం దుల ఉపేందర్,ఆర్ టీవీ ఉదయ్, 6టివి హరీష్, శ్రీధర్ శర్మ, చక్రవర్తి, అమరవరపు కోటేశ్వర రావు, రా మిశెట్టి విజేత , ప్రెస్ అధ్యక్షులు గు ద్దేటి రమేష్ బాబు, కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, టెంజు నగర అధ్యక్షులు యాలమందల జగదీష్, కార్యదర్శి అశోక్ ఉపా ధ్యక్షులు సాయి, కిరణ్, కల్యాణ్, సాయి, , కొమ్ము ఉపేందర్, జీవన్ రెడ్డి వీడియో గ్రాఫర్స్ అసోసి యే షన్ నాయకులు సుధాకర్, రంగా నాగేశ్వర రావు, బాబు,సతీష్, పృ ధ్వీ, శంకర్,ఫోటో గ్రాఫర్ యూని యన్ నాయకులు రాజు, మహేశ్, స్టార్ శ్రీను, రవి శంకర్ టి జె ఎఫ్ నాయకులు ముత్యాల కోటేశ్వరరా వు అంతోటి శ్రీనివాస్, ఈశ్వరి,న రేందర్, మోదుగు శ్రీధర్, నల్ల మోతు శ్రీనివాస్, ఇస్సాంపల్లి వెంకటేశ్వర్లు, కూరపాటి నరేష్, తోట గణేష్,బి శేఖర్ తదితరులు పాల్గొన్నారు