–నేటితో ముగియనున్న విచారణ కు మరో రెండు నెలల గడువు
Kaleshwaram project:ప్రజా దీవెన, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) విచారణ గడువు ను మరికొంత కాలం పొడిగించింది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులోని (Kaleshwaram project) మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బ్యారేజీలపై జరుగుతున్న విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ నెల 30వ తేదీతో గడువు ముగియ నుండగా విచారణ ప్రక్రియలో పలు దశలు మిగిలి ఉండడాన్ని గుర్తిం చిన ప్రభుత్వం (government) ఆగస్టు 31వ తేదీ దాకా పొడిగించాలని నిర్ణయించిం ది. ఈ మేరకు నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా (Rahul Bojja) శనివారం జీవో నెం.14 జారీ చేశారు. మరోవైపు జూలై మొదటి వారంలో తదుపరి విచారణ ప్రక్రియను చేపట్టడానికి జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Justice Pinaki Chandraghose) హైదరా బాద్ రానున్నారు. ఈ దఫా అఫిడ విట్లన్నీ పరిశీలించి, వాటిలోని అంశాల ఆధారంగా నోటీసులు జారీచేసి, వారిని విచారణకు పిలవ నున్నారు. మరోవైపు ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పూర్తిస్థాయి నివేదికను కూడా తెప్పించుకోనుంది. జాతీయ ఆనక ట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ ఏ) పూర్తి నివేదిక కూడా జూలై 7వ తేదీకల్లా ప్రభుత్వానికి చేరే అవ కాశాలు ఉన్నాయని సంకేతాలు వచ్చాయి.కాగా ఈ దఫా విచారణ ప్రక్రియ అత్యంత కీలకం కానుందని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి.