kanchagachibowli : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచ లనాత్మక వివాదాస్పద సంఘటనగా కొనసాగుతూ వస్తున్న కంచ గచ్చిబౌలి భూముల వ్య వహారంలో తెలంగాణ ప్రభుత్వా నికి బిగ్ షాక్ తగిలింది. ఆది నుంచి ఆటుపోట్లు ఎదుర్కొంటూ వస్తున్న కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం చుట్ట చివరకు ప్రజలు, ప్రతిపక్షాల వాదనకు మద్దతు లభిస్తూ ప్రభుత్వ వాదనను తప్పుపడుతూ భార త అత్యున్నత న్యాయస్థానం చెంపపెట్టు లాంటి ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వా ని కి ఎదురుదెబ్బ తగిలింది. కంచ గ చ్చిబౌలి భూముల్లో చెట్ల నరికి వేత పై రేవంత్ సర్కార్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చే సింది. చెట్లు కొట్టేసే ముందు అను మతులు తీసుకున్నారో లేదో స్ప ష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గ వాయి నిలదీశారు. సీఎస్‌ను కాపా డాలని అనుకుంటే వంద ఎకరాల ను ఎలా పునరుద్ధిస్తారో చె ప్పాలన్నారు. దీనిపై నాలుగు వారాల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు స్టేటస్ కోను విధించారు. కాగా, కంచ గచ్చిబౌలి భూముల అం శంపై జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బు ధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చెట్లు కొట్టివేసే ముం దు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీ ఆర్ గవాయి ప్రశ్నించారు.
దీనికి ప్రభు త్వ తరఫున లాయర్ స్పం దిస్తూ జామాయిల్ తరహా చెట్లు, పొద లను అనుమతి తీసుకునే తొలగిం చామని తెలిపారు. అందుకు చెట్ల నరికివేతపై సమర్థించు కోవద్దని జస్టిస్ బీఆర్ గవా యి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గద ర్శకాల ప్రకా రం అనుమతులు తీసుకు న్నారో లేదో చెప్పాలన్నారు.
వారంతపు సెలవుల్లో మూడు రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎం దుకొచ్చిందని ప్రశ్నించారు. మీ రు చెట్లు కొట్టడం వల్ల అక్కడ జం తువుల మీద కుక్కలు దాడి చేస్తు న్నాయని ఆ వీడియోలను చూసి ఆందోళనకు గురయ్యామని తెలి పారు. పర్యావరణ పరిరక్షణలో రా జీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలి వ్వాల్సి వస్తుందని తెలి పా రు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరు ద్ధంగా వ్యవహరిస్తే ఊరుకోమని జస్టిస్ గవాయి హెచ్చరించారు. భూముల మార్టిగేజ్‌తో తమకు సం బంధంలేదని చెట్ల నరికివేత గురించే తాము మాట్లాడుతున్నా మని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో అడవులు లేవని వాదిస్తే అదే ప్రాం తం లో జైలు కట్టి అందులోనే అధి కారులను పెట్టాల్సి ఉంటుందని జ స్టిస్ బీఆర్ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు కొట్టేసే ముందు అ నుమతి ఉందా లేదా అన్నదే ము ఖ్యమని తెలిపారు.
అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా అధికారు లు జైలుకు వె ళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఎస్‌ను కాపాడా లనుకుంటే వంద ఎకరాలను ఎలా పునరుద్ధిస్తారో చె ప్పాలన్నారు. పునరుద్ధరణ ఎలా చేస్తారు? ఎంతకాలంలో చేస్తారు? జంతు జా లాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. దీనిపై నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేశారు. తదుపరి వి చారణను మే 15వ తేదీకి వాయిదా వేశా రు. అప్పటివరకు స్టేటస్ కో విధించారు.