–పార్టీలు మారి ఆగమాగం కావొద్దు
–నమ్మినోళ్లే నడిసంద్రంలో వదిలి వెళ్తున్నారు
–వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్నో చూసినం, ఫర్వాలేదు
–ప్రతిపక్షంగా ప్రజల కోసం కొట్లా డుదాం
–పార్టీని ప్రక్షాళన చేద్దాం, తిరిగి అధికారంలోకి వస్తాం
–ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ ఎమ్మె ల్యేలతో కేసీఆర్ సమాలోచనలు
ప్రజా దీవెన, హైదరాబాద్: కష్టకాలంలోనే కలిసి ఉండి కదం కదం కలిపి ప్రజల కోసం పోరాడు దామని బిఆర్ఎస్ (BRS) అధినేత మాజీ ముఖ్యమంత్రి (KCR)పిలుపునిచ్చారు. అధికార పక్షం మాయమాటలు నమ్మి పార్టీలు మారి ఆగమాగం కావద్దని హితవ్ పలికారు. రాజకీ య పార్టీలకు ఒడిదొడుకులు సాధా రణ మని, రానున్న రోజుల్లో మళ్లీ పుం జుకుంటామని భారాస అధినే త కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. దేశంలోని రాజకీయ పార్టీ లన్నీ గెలుస్తూ, ఓడుతూ ఉంటా యని, మళ్లీ అధికారంలోకి వస్తా యని వెల్లడించారు. దేశాన్ని పాలిం చిన కాంగ్రెస్ (CONGRESS) రెండు సార్లు ప్రతిపక్ష ఓదాను కోల్పోయి ఈ సారి పుంజు కుందన్నారు. బీజేపీ 400 స్థానాలు వస్తాయని ఆశించి చివరికి 200ల్లో నే ఆగిపో యిందన్నారు. ఆవేశ పడి నిర్ణయాలు తీసుకొని రాజకీయ భవిష్యత్ను ఆగం చేసుకోవద్దని పార్టీ నేతలకు సూచించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy)లాంటి వారు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదని, అలాంటి వాటిని పట్టించుకోవద్దని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
మంగళ వారం ఆయన ఫామ్ హౌస్ పార్టీ (Farm house party) ఎమ్మెల్యేలు, నాయకులతో సమావే శమయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ వైఎస్ హయాంలో ఇ లాంటివి ఎన్ని జరిగినా భయపడలే దన్నారు. కొంత మంది పోతుంటా రని, అలాంటి వారిని నమ్మి పోయి ఇబ్బందులు తెచ్చుకోవద్దని సూచిం చారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫల మైందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్ర తలు పూర్తిగా దెబ్బతిన్నా యన్నా రు. భవిష్యత్తులో బీఆర్ఎస్ (BRS) కు మంచి రోజులు వస్తాయని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో తరుచూ సమావేశమవుతానన్నా రు. ఈ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగం టి గోపీనాథ్, ముఠాగోపాల్, మాధ వరం కృష్ణారావు, అరికెపూడి గాం ధీ, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సు భాష్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మె ల్యేలు జోగు రామన్న, ఇతర ఇతర సీనియర్ నేతలు భేటీ అ య్యారు.భారాసను వీడుతుంది పద వులు అనుభవించిన వాళ్లేనని భారాస అధినేత కేసీఆర్ వెల్లడిం చినట్లుగా సమాచారం. తాను నమ్మి న వాళ్లే మోసం చేసి పోతున్నారని, వాళ్లంతా పోయినంత మాత్రాన పెద్దగా వచ్చే ఇబ్బందులు ఏమీ లేవని తెలిపారు. మొదటి నుంచి ఉన్న వాళ్లు అంతా అలానే ఉంటు న్నా రని, మళ్లీ రానున్న ఐదేళ్లలో అధికారంలోకి వస్తామని చెప్పిన ట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొ న్నాయి. పోచారం శ్రీనివాస్ డ్డి, కడియం శ్రీహరి, సంజయ్, దానం నాగేందర్ అందరూ అలా చేసి వెళ్లిన వారేనంటూ సమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎవరు పోయినా పార్టీ తిరిగి పుంజు కుం టుందని ధీమాను వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే లకు కేసీఆర్ దైర్యం చెప్పారని సమాచారం.
ఆరు మాసాలు ఆగండి… భారాసపై కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ (Congress Operation Akarsh) మొదలు పెట్టడంతో పార్టీ ఎమ్మె ల్యేలు తొందరపడొద్దని కేసీఆర్ (KCR) సూచించినట్లుగా విశ్వసనీయ వర్గా లు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యిం దని మరో ఆరు నెలలు ఒపికపట్ట డండని, రానున్న రోజుల్లో పోరాటా లు చేయనున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన హామీలను అమలు చేసేం దుకు కొంచెం సమయం ఇద్దామని అంత వరకు వేచి చూద్దామంటూ వివరించారు. అంతే కాకుండా పార్టీ ప్రక్షాళన కూడా అప్పేడే చేద్దామని చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాలు (Trusted groups) పేర్కొన్నాయి. పార్టీలు మారిన వారంతా ఆగమైయ్యారని, రాజ కీయాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివికావని సూచించారని తెలుస్తోంది. అధికారం ఉన్నా లేకు న్నా సిద్దాంతం కోసం కట్టు బడి ఉండే వారికి భవిష్యత్లో మంచి అవకాశాలు ఉంటాయని సూచిం చారు.భారాసను వీడి కాంగ్రెస్లో చేరి న ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అన ర్హత వేటు పడుతుందని కేసీఆ ర్ తనను కలిసిన నేతలతో కేసీఆర్ వెల్లడించినట్లుగా సమాచారం. అంతేకాకుండా సుప్రీం కోర్టు సైతం అనర్హత విషయంలో చాలా సీరి యస్ గా ఉందని సూచించారు. అనర్హత తీర్పు ఇచ్చిన వారే ఇప్పు డు సుప్రీంకోర్టులో ఉన్నారని, వాటి ని ఆరు నెలల్లోనే తుది తీర్పు వస్తుందని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ దగ్గర మూడు నెలలు, హైకోర్టులో మూడు నెలలు ఆ తర్వాత అనర్హత వేటు పక్కా అని ధీమాను వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
పార్టీని వదిలే ప్రసక్తే లేదు…
ఫామ్ హౌస్ లో (FARM HOUSE)సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, నేతలందరూ తాము పార్టీనీ వీడే ప్రసక్తేలేదని కేసీఆర్ చెప్పి నట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీలోనే కొన సాగుతామని చెప్పినట్లుగా తెలుస్తోంది. చర్చలు జరిపిన మా ట కూడా ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. ఈ సమా వేశంలో పాల్గొన్న కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతా రన్న ఊహాగానాలు జోరుగా సాగాయి. ప్రస్తుతం సైతం అలాoటి అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
సమావేశానికి డుమ్మా..
కేసీఆర్ తో జరిగిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) లోని ఎమ్మెల్యేలు కొంత మంది రాకపోవ డంపై అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లా రు. ఆయన దీనిపై స్పందిస్తూ తన కు సమాచారం లేదని, కొన్ని కేసుల రీత్యా ఢిల్లీకి వెళ్లానంటూ స్పష్టం చేశారు. మరోవైపు ఆయన మాత్రం కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కోసమే ఢిల్లీకి (DELHI) వెళ్లినట్లుగా చర్చ సాగుతోంది. ఈ సమావేశానికి ఉప్ప ల్, ఎల్బీనగర్, అంబర్ పేట్ మల్కా జిగిరి ఎమ్మెల్యేలు సైతం హాజరు కాలేదు. సీఎంఢిల్లీలో ఉండటంతో అక్కడికి కొంతమoది భారాస ఎమ్మె ల్యేలు వెళ్లారని విశ్వసనీయ వర్గా లు పేర్కొ న్నాయి. నలుగురు నుం చి ఐదుగురు ఎమ్మె ల్యేలు ఢిల్లీ లోనే ఉన్నట్లుగా సమాచారం. అన్ని కుదిరితే ఆ ఎమ్మె ల్యేలు ఒకటి రెం డు రోజుల్లో చేరే అవకాశాలున్న ట్లుగా తెలుస్తోంది.