— రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన,నల్లగొండ: ప్రతి గ్రామా నికి, అన్ని మున్సిపల్ వార్డులకు రోడ్లు, ఇల్లు లేని నిరుపే దలకు ఇండ్లు ఇవ్వడం, చెరువుల ను కృష్ణ జలాలతో నింపడమే తన ధ్యేయమని, అప్పుడే ప్రజల రుణం తీర్చుకున్నట్లని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkata Reddy) అన్నా రు. గురువారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు (Inaugural ceremonies) చేశారు. కోటి రూపాయల వ్యయంతో చంద్రగిరి విల్లా నుండి నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు . ప్రకాశం బజార్లో 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మటన్ మార్కెట్ ను ప్రారంభించారు. ఏ ఆర్ నగర్లో మస్రంపల్లి రోడ్డు నుండి ఏ ఆర్ నగర్ వరకు 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో 500 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారి, మురికి కాలువల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 6 కోట్ల రూపాయల వ్యయంతో తాళ్లాయిగూడెం పిట్లంపల్లి వరకు సిసి రోడ్డు నిర్మించేందుకు టెండర్లు పిలిచామని ,నెల రోజుల్లో పనులు మొదలు పెడతామని తెలిపారు. చంద్రగిరి విల్లా రోడ్డు పనులను వెంటనే ప్రారంభించి దసరా లోపు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ,పనులు నాణ్యతగా ఉండాలని, వేగంగా చేయాలని మున్సిపల్ కమిషనర్, ఇంజనీర్లను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. చంద్రగిరి విల్లా లో తాగునీటి సమస్యను తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో తాగునీటి పైప్లైన్లను మార్చి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
నల్గొండ పట్టణంలో తాగునీటి సమస్యను (water )తీర్చేందుకు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నామని ఇందుకు 400 కోట్ల రూపాయలతో పట్టణంలో 11 లక్షల తాగునీటి సామర్థ్యం ఉన్న 15 తాగునీటి ట్యాంకులను నిర్మిస్తున్నామని, దీంతో ప్రతి ఇంటికి తాగునీరు వస్తుందని చెప్పారు. బ్రాహ్మణ వెల్లెముల, ఎస్ఎల్ బిసీలు పూర్తయితే జిల్లాలోని చెరువులను కృష్ణా నీటితో నింపవచ్చని, ఇందులో భాగంగానే బ్రాహ్మణ వెళ్లెముల ద్వారా నింపేందుకు నిధులు సైతం విడుదల చేయడం జరిగిందని వెల్లడించారు. మహాత్మ గాంధీ యూనివర్సిటీ పక్కన 25 కోట్ల రూపాయల వ్యయంతో హరిత హోటల్ ను టూరిజం శాఖ ద్వారా నిర్మించనున్నట్లు తెలిపారు. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు (Indiramma houses)నిర్మించి ఇస్తామని, 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగించే వారికి గృహ జ్యోతి పథకం కింద జీరో బిల్లులు ఇవ్వడం జరుగుతున్నదని, అంతేకాక మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే ఎల్ పి జి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా కోటి రూపాయల వ్యయంతో ప్రకాశం బజార్లో మటన్ మార్కెట్ (Mutton market)ను నిర్మించడం జరిగిందని, వ్యాపారస్తులు దీనిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ మటన్ మార్కెట్ లో షాపులు పొందలేకపోయిన వారికి అవసరమైతే మరోచోట నిర్మించి ఇస్తామన్నారు. స్లాటర్ హౌస్ నిర్మాణానికి వెంటనే స్థలాన్ని గుర్తించాలని ,ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు. ప్రకాశం బజార్లో కొన్ని సంవత్సరాలుగా వివాదంలో ఉన్న గోల్డ్ షాపుల వివాదాన్ని 15 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు . ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా బొట్టు గూడా హైస్కూల్ ను 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నామని, దీన్ని డిసెంబర్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేదలందరికీ ఇండ్లు ఇచ్చేందుకు 50 ఎకరాల స్థలాన్ని చూడడం జరిగిందని, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని, జిల్లాలో గ్రామానికి రహదారితో పాటు, మున్సిపల్ పట్టణాలలో అన్ని వార్డులకు రోడ్లు, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వడం, చెరువులను కృష్ణ జలాలతో నింపి ప్రజల రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
అనంతరం మంత్రి మాన్యం చెలక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అంతేకాక జైలుఖానా Jail Khana)చౌరస్తాను పరిశీలించి, జంక్షన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని, జంక్షన్ విస్తరణతో పాటు, జంక్షన్ ను అందంగా తీర్చిదిద్దాలని ,అంతేకాక యాక్సిడెంట్లు కాకుండా నిరోధించేందుకు జైలు కాంపౌండ్. వాల్ ను కొద్దీ భాగం తొలగించాలని సూచించారు. ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,ఆర్ అండ్ బి ఎస్ ఈ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, ఆయా వార్డు కౌన్సిలర్లు, తదితరులు ఉన్నారు.