*ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి.
*విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ను రాణించాలి. లక్ష్మీనారాయణరెడ్డి
Lakshminarayana Reddy: ప్రజా దీవెన, కోదాడ: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని టీపీసీసీ డెలికేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి (Lakshminarayana Reddy) బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ నయిమ్ లు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో మహేంద్ర యూత్ అధ్యక్షులు లాజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోదాడ నియోజకవర్గ స్థాయి బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ (Box Cricket Tournament) విజేతలకు బహుమతులను అందజేసి మాట్లాడారు.నేటి యువత క్రీడా స్ఫూర్తిని (Sports spirit of youth)అలవర్చుకొని క్రీడల్లో రాణించాలన్నారు.ఓటమి విజయానికి నాంది అని క్రీడాకారులు గెలుపు, ఓటమిలను సమానంగా స్వీకరించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో ప్రథమ బహుమతి కోదాడకు చెందిన మహేంద్ర యూత్ అండ్ టీం, ద్వితీయ బహుమతి లగాన్ అండ్ టీం, తృతీయ బహుమతి పోలీస్ టీం, నాలుగవ బహుమతి క్యాంప్ టీం లు గెలుపొందాయి.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ నాయకులు, పంది తిరపయ్య, కర్ల సుందర్ బాబు, నాగరాజు,షేక్ మస్తాన్, షేక్ అలీమ్, అబ్బు తదితరులు పాల్గొన్నారు.