Long Hair Tips: మహిళలు అందరూ చాలా వరుకు అందమైన ఒత్తైన జుట్టు (thick hair)ఉండాలని కోరుకుంటారు అందుకోరారుకు అనేక జాగ్రత్తలు తీసుకోవడం , టిప్స్ పాటిస్తూ ఉంటారు. ఇక జుట్టు బలంగా, దృఢంగా ఉండి పెరగాలి అని అనేక ఆయిల్స్ ను వాడుతూ ఉంటారు . ఇక ముందు మనం ఆరోగ్యకరమైన ఆహారం (Healthy food) తీసుకుంటే.. 70 శాతం ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్లే. అయితే ఆ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. అయితే మార్కెట్లో ఉండే క్రీములు, లోషన్లు, ఆయిల్స్, షాంపూలు వాడితే జుట్టు ఆరోగ్యంగా ఉండదు. డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టే బదులు.. తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మెయిన్ గా జుట్టుకు ఆయిల్స్ ఎంచుకునే విషయంలో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు కొందరు. కానీ మనం మంచి ఆయిల్ తలకు రాస్తే.. బలమైన, ఒత్తైన, పొడవైన జుట్టు చాల సులువుగా సొంతం అవుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆయిల్స్ (oils) వాడితే బెటర్ అనే విషయానికి వస్తే..
జుట్టు బాగా పెరగడానికి కొబ్బరి నూనె (coconut oil) ఎంతో సహాయ పడుతుంది. జుట్టు పెరిగేందుకు, బలంగా, దృఢంగా ఉండేందుకు కొబ్బరి నూనె ఎంతో చక్కటి ప్రదార్థం అనే చెప్పాలి. ఇక కొబ్బరి నూనెలో మంచి పోషకాలు లభిస్తాయి. ఇవి చర్మా, జుట్టును ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ నూనెలో మాయిశ్చ రైజేషన్ అనేది ఎక్కువగా కనుక తలకు రాసుకుంటే జుట్టు సాఫ్ట్‌గా ఉండడంతో పాటు ఒత్తుగా పెరిగేందుకు హెల్ప్ చేస్తుంది.. డబుల్ బాయిలింగ్ (Double boiling) పద్దతిలో కొబ్బరి ఆయిల్ వేడి చేసి తలకు రాసి మర్దనా చేయడంతో తలపై రక్త ప్రసరణ బాగా పెరిగి.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు బాగా సహాయ పడుతుంది..
అలాగే జుట్టుకు రక్షణ ఇవ్వడంలో ఆలివ్ ఆయిల్ (Olive oil)కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. పొడి జుట్టు ఉన్నవారు ఆలివ్ ఆయిల్ రాసుకుంటే.. జుట్టుకు మంచి కండీషనర్‌గా ఉపయోగ పడుతుంది. అలాగే జుట్టును మృదువుగా, బలంగా చేస్తుంది. మంచి సువాసన అందిస్తుంది. అయితే ఆలివ్ ఆయిల్ కాస్త ఖరీదు ఎక్కువగా ఉన్న మార్కెట్ లో రిసల్ట్ మాత్రం త్వరగానే ఉంటుంది.
ఇక జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో బాదం ఆయిల్ కూడా ఒకటి. ఇక బాదాం ఆయిల్‌లో (Almond oil) విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ ఆయిల్‌తో తలకు మర్దనా చేసుకుంటే.. ఒత్తిడి, ఆందోళన తగ్గి.. మనసు రిలాక్స్ కూడా అవుతుంది. అంతే కాకుండా జుట్టును సాఫ్ట్‌గా, బలంగా, ఒత్తుగా పెరిగేలా చూసుకుంటుంది. ఇంకెందు ఆలస్యం మీరు కూడా ఈ ఆయిల్స్ తో మర్దన చేసుకొని పొడుగాటి జుట్టు ను సొంతం చేసుకోండి.