Maruti Swift Dzire: మన భారత్ దేశంలో మారుతి బ్రాండ్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మారుతి నుంచి స్విఫ్ట్‌కు (swift)మరింత ఎక్కువ పాపులారిటీ ఉన్న సంగతి అందరికి విదితమే. మన దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే కార్లలో ఒకటిగా స్విఫ్ట్ గా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా స్విఫ్ట్ డిజైర్ (Swift Desire) కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు డిజైర్ నుంచి వచ్చిన అన్ని వేరియంట్స్ భారీగా అమ్మకాలు జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా స్విఫ్ట్ డిజైర్ (Swift Desire)నుంచి కొత్త వేరియంట్ మార్టుకెట్లోకి రాబోతుంది దాని వివరాలు ఇలా.. .
అక్టోబర్ 3వ వారంలో మారుతీ సుజుకీ డిజైర్ (Maruti Suzuki Dzire)కొత్త వేరియంట్ రాబోతుంది. ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తునట్టు సమాచారం. ఈ కొత్త డిజైర్‌లో లాంటి ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలను మనం ఇప్పడు చూద్దాం.. క్రోమ్ ఫినిషింగ్‌తో వచ్చే మల్టిపుల్ హారిజాంటల్ స్లాట్స్‌తో కూడిన భారీ గ్రిల్, డీఆర్ఎల్లతో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ లైట్స్ ఇందులో ఉండనున్నాయి. కొత్త అలాయ్ వీల్స్‌తో ఈ కారును మార్కెట్లోకి ప్రవేశ పెట్టబోతున్నారు.
ముఖ్యంగా మారుతీ సుజుకీ డిజైర్ ఇంటీరియర్‌లో (Desire interior)భారీగా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. క్యాబిన్‌లో గణనీయైన మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 360-డిగ్రీల కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఇవ్వనున్నట్లు సమాచారం. దీనితో పాటు యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ (Apple Car Play and Android Auto support)చేసే ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్‌ను ఇందులో ఇవ్వనున్నట్లు ప్రముఖులు అంటూన్నారు. స్పోర్టీ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్‌తో కూడిన ఈ కారులో పుడిల్ ల్యాంప్స్, హెడ్-అప్ డిస్ప్లే, స్టైలిష్ డ్యూయెల్-టోన్ బీజ్, బ్లాక్ ఇంటీరియర్ డిజైన్ (Puddle lamps, head-up display, stylish dual-tone beige, black interior design)వంటి ఫీచర్లను అందిస్తోంది .ఇక ఈ కార్ ఇంజన్ విషయానికొస్తే 1.2-లీటర్, 3 సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో ఉండబోతుంది. 80బీహెచ్పీ పవర్, 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది 5-స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ ఆప్షన్స్ ఇందులో ఇవ్వనున్నారు. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతి త్వరలోనే ఈ కారుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నటు నిపుణులు తెలియ చేస్తున్నారు..