IndiaPoliticsతెలంగాణనల్గొండ

Minister Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్ర కటన, ఫణిగిరి బౌద్ధక్షేత్రంకు రూ.5 కోట్ల నిధులు మంజూరు

Minister Krishna Rao: ప్రజా దీవెన, తుంగతుర్తి: అది దా దాపు 2500 ఏళ్ల నాటి కాలం… బౌద్ధ భిక్షువులు శాంతి మంత్రాన్ని జపించిన పవిత్ర భూమి. ఆచార్య నాగార్జునుడి పాదస్పర్శతో పుల కించిన నేల. కాలగర్భంలో కలిసి పోయిన ఆ అద్భుత చారిత్రక వై భవానికి ఇప్పుడు మళ్లీ పూర్వ వై భవం రాబోతోంది. సూర్యాపేట జి ల్లా నాగారం మండలంలోని ప్రసిద్ధ ఫణిగిరి బౌద్ధ క్షేత్రం, అలాగే గాజు లబండ బౌద్ధ క్షేత్రాల పునరుద్ధర ణ కు సరికొత్త అడుగులు పడ్డాయి.
సోమవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలుతో క లిసి ఫణిగిరి గుట్టపై ఉన్న బౌద్ధా రామాలను, మ్యూజియాన్ని సం దర్శించారు. ఈ సందర్భంగా క్షే త్రా ల పునరుద్ధరణ పనులకు శంకు స్థాపన చేయడంతో పాటు ఫణి గి రి అభివృద్ధి కోసం రూ. 5 కోట్ల భా రీ నిధులను మంజూరు చేస్తున్న ట్లు మంత్రి ప్రకటించారు. మ్యూజి యంలో భద్రపరిచిన శతాబ్దాల నా టి చరిత్రను మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆసక్తిగా తిలకించారు.

తవ్వకాల్లో బయటపడ్డ అరుదైన నాణేలు, కరెన్సీతో పాటు అపు రూపమైన బుద్ధుని విగ్రహాలు, బు ద్ధపాదాలు, చారిత్రక అవశేషాలు ఇక సమ్రాట్ అశోకుని కాలం నాటి విశిష్ట శాసనాలు తదితర ఈ చారి త్రక సంపదను చూసి అబ్బురప డి న మంత్రి, దేశంలో ఎక్కడా లేని వి ధంగా తెలంగాణలో అద్భుతమైన వారసత్వ సంపద, కట్టడాలు ఉ న్నాయని కొనియాడారు.

నాడు ఇక్ష్వాకులు, కాకతీయులు, నిజాం నవాబులు ఈ నేలపై ఎన్నో వైవిధ్యమైన నిర్మాణాలు చేశారు. అందులో భాగంగానే వెలసిన ఫణి గిరి ఎంతో ప్రసిద్ధమైనది. గత ప్ర భుత్వాల నిర్లక్ష్యానికి గురైన టూరి జం శాఖను ఇకపై దేశంలోనే నెం బర్ వన్ స్థానంలో నిలబెడతామని
మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడిం చారు.

పీపీపీ మోడల్‌లో అభివృద్ధి..

యువతకు ఉపాధి రాష్ట్రంలోని పర్యాటక రంగ అభివృద్ధి కోసం స రికొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రై వేట్ భాగస్వామ్యం (PPP Mod e) ద్వారా పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేసి, స్థానిక యువతకు వందలాది సంఖ్యలో ఉపాధి అవ కాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చా రు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జి ల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవ ర్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్య క్షు లు గుడిపాటి నరసయ్యతో పాటు పలువురు వివిధ శాఖల అధికా రు లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button