IndiaOpinionజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Minister Komatireddy Venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, అమరుల త్యాగాల ఫలమే నేటి తెలంగాణ.

ప్రగతి పథంలో విప్లవాల పురి టిగడ్డ -- ధాన్య సేకరణలో రాష్ట్రంలోనే నల్లగొండ నంబర్ వన్ --నల్లగొండ జిల్లా ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

 

Minister Komatireddy Venkatreddy :  ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం 12 వసంతాలు పూర్తి చే సు కుని 13వ సంవత్సరంలోకి అ డుగుపెడుతున్న శుభ సంద ర్భాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలం గాణ రాష్ట్ర అవ తరణ దినోత్సవ వేడుకలు పండు గ వాతా వరణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రోడ్లు, భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జాతీ య పతాకాన్ని ఆవిష్కరించి, జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శు భా కాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “నల్లగొండ జిల్లా సా యుధ పోరాటం నుండి మలిదశ ఉద్యమం వరకు సింహ భాగం పాత్ర పోషించి న విప్లవాల పురిటిగడ్డ అని, నాటి ఉ ద్యమంలో ప్రజల ఆకాంక్ష కోసం నా మంత్రి పదవినే తృణ ప్రాయంగా విసిరికొట్టి, ఆమరణ దీక్షకు దిగి న చరిత్ర నాది అని గుర్తు చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలో జిల్లాను అభివృ ద్ధి, సంక్షేమాల్లో అగ్రభాగాన నిలబె ట్టే బాధ్యత నాది” అని స్పష్టం చేశారు. మార్చి 6 నుండి జూ న్ 12 వరకు 99 రోజుల పాటు జరుగు తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణా ళిక సాధించిన విజయాల రిపోర్ట్ కార్డ్‌ను ఈ సందర్భంగా మంత్రి విడుదల చేశారు.

యాసంగి (2025-26) సీజన్ లో రూ. 2,389 మద్దతు ధర తో, 459 కేంద్రాల ద్వారా 7,24,033 మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని సేకరించి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలి చిం దని, ఇందుకు గాను 78,650 మంది రైతుల ఖాతాల్లో రూ.1,2 2 3.88 కోట్లు నేరుగా జమయ్యా యని తెలిపారు. జిల్లాలో 2,3 3,981 మంది రైతులకు రూ.2,00 4.83 కోట్ల రుణమాఫీ జరిగిందని, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఇప్ప టివరకు 10 కోట్ల 83 లక్షల ఉచిత ప్రయాణాల ద్వారా రూ. 508.85 కోట్ల లబ్ధి చేకూరింది. 2,52,963 మంది లబ్ధిదారు లకు రూ.44.12 కోట్ల సబ్సిడీ బదిలీ అయిందన్నారు.

200 యూనిట్ల లోపు వాడే 2,51 ,117 మందికి జీరో బిల్లు లు జారీ కాగా ప్రభుత్వ సబ్సిడీ రూ.184. 40 కోట్లుగా ప్ర భుత్వం భరించిం దని చెప్పారు. మొదటి విడత కింద 18,8 37 ఇండ్లు మంజూరు కా గా, ఇప్పటివరకు రూ.275 కోట్లు విడుదలయ్యాయి. త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి అద నంగా మరో 2,000 ఇండ్లుbమంజూరు చేయ నున్నామ న్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ లైనింగ్‌కు రూ.54 కోట్లు, AMR SLBC ప్రాజెక్టుకు రూ.496 కోట్లు, డిండి లిఫ్ట్ ఇరిగేష న్ హెడ్ రీచ్ పనులకు రూ.1800 కోట్లు మంజూరై పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (HA M) కింద జిల్లాలో ఫేజ్-1 లో 532. 05 కి.మీ రహదారుల కోసం రూ. 1,457.66 కోట్లు నల్లగొండ ఘాట్ రోడ్డుకు రూ.140 కోట్లు కేటాయిం పులు చేసినట్లు తెలిపారు. ప్రతి ని యోజకవర్గంలో రూ.200 కోట్ల తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ పాఠశాలల నిర్మాణం తో పాటు మహాత్మా గాంధీ వర్సిటీలో ఈ ఏడాదే లా, బి.ఫార్మసీ కోర్సులు ప్రారంభం జరుగుతోందని పేర్కొ న్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉన్నతీకరణకు రూ.32 .85 కోట్లు, నర్సిం గ్ కళాశాలకు రూ .40 కోట్లు కేటాయించడం జరిగింద న్నా రు. 4 యూనిట్లలో వాణిజ్య వి ద్యుత్ ఉత్పత్తి (రోజుకు 7 6.8 మి లియన్ యూనిట్లు) ప్రారంభమైంది. చివరి యూని ట్ 2026 జూలై నాటికి పూర్తి కానుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఘనంగా సన్మా నించారు. చండూ రు మండలం ఉ డతలపల్లికి చెందిన కొరివి శ్రీదేవి -శివ దం పతులకు ఇందిరమ్మ ఇం టి గృహపత్రాన్ని, మెప్మా (MEPM A) ద్వారా లబ్ధిదారులకు రూ.6 కో ట్ల 46 లక్షల 50 వేల చె క్కును, స్త్రీ నిధి రుణాలను మంత్రి అందజేశా రు. విధి నిర్వ హణలో ఉత్తమ ప్రతి భ కనబరిచిన ఉద్యోగులకు ప్రశం సా పత్రాలు, పోలీసులకు సేవా ప థకాలు అందజేశారు. పర్యా వరణ వేసవి శిబిరాల్లో ప్రతిభ చూపిన క ట్టంగూరు, నిడమ నూరు, మిర్యాల గూడ విద్యార్థులకు జ్ఞాపికలు బ హుకరిం చారు.

   ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన

DRDA, వైద్య ఆరోగ్య, రవాణా, అ గ్నిమాపక తదితర శాఖ లు రూ పొందించిన ప్రగతి శకటాల ప్రద ర్శన, బాల భవన్ నాగార్జునసాగర్ విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శ్రీ శరత్ చం ద్ర పవార్, జిల్లా యంత్రాం గం, ప్ర జాప్రతినిధులు మరియు సమాచా రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడి యా మిత్రులకు మంత్రి హృదయ పూ ర్వ క ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నెల్లి కంటి సత్యం, శంకర్ నా యక్, నల్ల గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాసరెడ్డి, అదన పు కలెక్టర్ జే. శ్రీని వాస్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డిప్యూటీ మే యర్ అష్రఫ్ అలీ, మా ర్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కార్పొరేటర్ కవిత, ప్రజా ప్రతిని ధులు మరియు జిల్లా అధి కారులు పాల్గొన్నారు.

అమరవీరుల స్థూపం వద్ద ‘హోలోగ్రాఫిక్’ నివాళులు

అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్మృత్యర్థం న ల్గొండ నడిబొడ్డున ఉన్న క్లాక్ టవర్ జంక్షన్ సరికొత్త సాంకే తిక శోభను సంతరించుకుంది. అధునాతన లిక్విడ్-క్రిస్టల్ డిస్‌ప్లేలు, స్మార్ట్ ఎనర్జీ గ్రిడ్‌లతో పునర్నిర్మించిన అమరవీ రుల స్థూపం వద్ద నేడు ఒక అపురూపమైన వేడుక జరిగిం ది. రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సరికొత్త ‘క్వాంటమ్-ఎనర్జీ’ పుష్పగుచ్ఛాన్ని స్థూపం వద్ద ఉంచి అమరులకు ఘన నివా ళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి , ఎంఎల్ సి నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్  ప్రత్యేక ఏఐ-అసిస్టెడ్ అడ్మి ని స్ట్రేషన్ ప్రోటోకాల్స్‌ను పరిశీలించారు. అలాగే, శాంతిభద్ర తల పరిరక్షణలో భాగంగా ఎస్ పి శరత్ చంద్ర పవర్తన హై పర్-విజిలెన్స్ సెక్యూరిటీ డ్రోన్ల నెట్‌వర్క్‌తో క్లాక్ టవర్ పరిస రాలను సురక్షిత జోన్‌గా మార్చారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లా డు తూ అమరవీరుల త్యాగాలు ఈ తరం డిజిటల్ యుగానికే కాదు, రాబోయే వందల తరాల భవిష్యత్తుకు కూడా దిక్సూ చి. వారి ఆశయాలకు అనుగుణంగానే నల్గొండను ఒక గ్లోబల్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం. ఈ కార్యక్రమంలో అమరుల జ్ఞాపకార్థం క్లాక్ టవర్ స్కై-లైన్‌లో లేజర్ షో ద్వా రా ప్రదర్శించిన ‘అమరుల వీరగాధ’ నల్గొండ ప్రజలను ఎం తగానో ఆకట్టుకుంది.

Related Articles

Back to top button