Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Miss world 2025 : అందాల భామలను ఆకట్టుకున్న భూధాన్ పోచంపల్లి

 

— పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఇక్క త్ వస్త్రాలతో విహరించిన సుంద రాంగులు
–ఆకట్టుకున్న ఇక్కత్ చీరల ప్రక్రియ, డిజైన్ లు
–అపూర్వ స్వాగతాని కి అబ్బుర పడిన అందగత్తెలు
–రుంజా సంగీతానికి, ఫాషన్ షో సంగీతానికి మైమరచి నర్తించిన సుందరీమణులు

Miss world 2025: ప్రజా దీవెన, భూదాన్ పోచంపల్లి: ప్రపంచ సిల్క్ సిటీగా, సాంస్కృ తిక వారసత్వం, ఇక్కత్ చీరల నేతకు ప్ర సిద్ధి గాంచిన భూ దన్ పోచంపల్లి అంతర్జాతీయ సుందరీమణుల మన్ననలు పొం దిం ది.గురువారం ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు భూదాన్ పోచారంపల్లి గ్రామా న్ని సందర్శిం చి, పోచంపల్లి చీరల తయారీ ఇక్క త్ వస్త్రాలను చూసి అబ్బురపడ్డా రు.అంతేకాక రుంజా వాయిద్యం, సంస్కృ తి,సాంప్రదాయ నాదస్వ ర ,కోలాటాల స్వాగతంతో మైమర చిపో యారు. సిందూరం, సంగీ తం, చేతినేతల మధ్య కళాత్మకమైన ఈ సందర్శనం అతిథుల హృదయా లను రంజింపజేసింది.

గ్రామ చేనేత పార్క్ ప్రవేశద్వారం వద్దే స్థానికులు సంప్రదాయ వ స్త్రాలతో కంటెస్టెంట్లకు స్వాగతం పలికారు. సిందూరం నుదుట దిద్ది, పువ్వుల మాలలు అందిస్తూ “పో చంపల్లికి హృదయపూర్వక స్వాగ తం” అంటూ అందగత్తెలకు హృ దయాలను హత్తుకునేలా ఆత్మీ య స్వాగతం పలికారు. పోచంపల్లి చే నేత టూరిజం పార్క్ ప్రవేశ దారం వద్ద ఫోటోలకు ఫోజులిస్తూ“ తెలం గాణ జరూర్ అనా” అం టూ నిన దించారు.

ఇక్కత్ చీరల తయారీని చూసి వీరు అబ్బురపడ్డారు.ప్రత్యేకమైన ఇక్కత్ చీరల తయారీ విధానాన్ని స్థానిక పార్కులోపరిశీలించిన అ తథులు, నూలు వడకడం నుంచి రంగులు చొప్పించే క్లిష్టమైన ప్రక్రి యలను చూసి ఆశ్చర్యచకి తుల య్యారు. “ఒక్క చీరకు వారాలు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనా త్మకత కంటెస్టెంట్ లను మనస్సు ను హత్తుకుంది. చీరలపై భిన్న డిజై న్లను గమనించిన అతిథులు, కొం దరు స్వయంగా రాట్నంతో నూలు వడికే ప్రయత్నం చేశారు. అంతేకాక చీరలను పట్టుకొని చూసి పరవసించారు.

చేనేత టూరిజం పార్కు లో స్థానిక కళాకారులు ప్రదర్శించిన రుంజా కిన్నెర,వాయిద్యాల మధుర సంగీ తం అందగత్తెలను మంత్రముగ్ధు ల్ని చేసింది. కొందరు కంటెస్టెంట్ లు స్వయంగా రుంజా వాయిం చగా, మరికొందరు సంగీథానికి ల యబద్దంగా నాట్యం చేశారు. చే నేత పార్కులో ఏర్పాటు చేసిన మెహింది స్టాల్ వద్ద చేతులకు మె హందీ వేయించుకొన్నారు. సంద ర్శన కంటెస్టెంట్ లు స్థానిక కళాకా రుల నుంచి మెహందీ టాటూలు వేయించుకున్నారు. అరి చేతు లపై నెమలి సోయగం, నాజూకైన నక్ష త్రాలు, పువ్వుల డిజైన్లతో మురి సిపోయిన బ్యూటీలు ఫోటో సెష న్లకు పోజ్ ఇచ్చారు. రాట్నం తో నూలు వడికే విధానంను సుందరీ మణులు పరిశీలించారు. కొం త మంది స్వయంగా రాట్నం ఒడికి మురిసిపోయారు.

పోచంపల్లి చేనేతగ్రామీణ పార్కు ఆవరణలో ఏర్పాటుచేసిన పో చంపల్లి, వెంకటగిరి ,గొల్లభామ, నారాయణపేట, వస్త్రాల ప్రదర్శన ను సందర్శించారు. చివరగా యాం పి థియేటర్లో భూదాన్ పోచం పల్లి ప్రస్థానం, హ్యాండ్లూమ్‌పై ప్రత్యేక వీడియోను మిస్ వరల్డ్ కం టెస్టెంట్ లకు ప్రదర్శించారు. జిల్లా యం త్రాంగం ప్రతి క్షణాన్ని అం దగత్తెలు ఆస్వాదించేలా చక్కని ఏర్పాట్లు చేసింది.

మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ల రూరల్ టూర్ నిర్వహించడంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న యా దాద్రి భువనగిరి జిల్లా యంత్రాగం స్థానిక ప్రజా ప్రతినిధుల సహకా రం, సమన్వయంతో జిల్లా కలెక్టర్ ఎం హనుమంత రావు నేతృత్వం లో పోచంపల్లి గ్రామ చేనేత పా ర్కలో అందాల భామల కోసం చ క్కని ఏర్పాట్లు చేశారు.చేనేత పా ర్క్ కు ప్రపంచానికి పరిచయం చే సేలా వరల్డ్ టూరిజం లో ప్రత్యేక గుర్తింపు దక్కేలా చక్కగా ప్రమోట్ చేశారు.

3 గంటలకు పైగా సాగిన కార్యక్రమంలో స్థానిక కళాకారు లు వా యిద్యాలు, మెహందీ, చేనే త వస్త్రాల ప్రాధాన్యం, తయారీ, ఇక్కత్ చీరల ప్రత్యేక గుర్తింపును తెలియజేస్తూ స్థానిక సంస్కృతితో కంటె స్టెంట్ లను పూర్తిగా మమేకం అయ్యేలా చేశారు. ప్రతి క్షణాన్ని అందగత్తెలు ఆస్వాదించేలా కార్య క్రమాలను ప్లాన్ చేసారు. చివర లో అందగత్తెలకే అసూయపుట్టేలా నిర్వహించిన ఫ్యాషన్ షో పో చంప ల్లి సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రపంచ అందగత్తెలే అ చ్చెరువు పొందేలా అసూయ పుట్టేలా భార తీయ నారిమ ణుల ఇక్కత్ చీరల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగిం ది. సంప్రదాయం ఉట్టిపడే లా ధరించిన చేనేత, ఇక్కత్ వస్త్రాలతో ఆత్మవిశ్వా సం నింపుకున్న యువతులు యాంపి థియేటర్ వేదికగా జోష్ నింపారు. షో జరు గుతున్నంత సేపు ప్రపంచ అందగ త్తెలు కళ్ళార్పకుండా చూస్తూ చప్ప ట్లు, కేరింతలతో ప్రోత్సహించారు. షో చివరలో ఫ్యాషన్ షో లో పా ల్గొన్న యువతులను మిస్ వరల్డ్ కం టెస్టెంట్ లు కలసి అభినందించారు. స్థానికులు ఈ షోను ఆసక్తి గా తిలకించారు. ఈ ఫ్యాషన్ షో స్థానికులకే కాదు. అందగత్తెలకు సరి కొత్త అనుభూతి మిగిల్చింది.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ చీరల ప్రాము ఖ్యతను తెలియజేశారు. ఇక్కత్ అనేది ఒక బ్రాండ్ నూలు ఉడకబె ట్టడం,వడకడం,రంగుల అద్దకం వంటి టెక్నాలజీ ఎక్కడ లేనివిధం గా పోచంపల్లి లోనే ఉంటుందని తెలిపారు .పోచంపల్లి చేనేత చీర లు పూర్తిగా చేతితో మగ్గంపై ఎ న్నో సంవత్సరాల నుండి చేస్తున్న సం ప్రదాయ కల అని, ఎంతో మంది మహిళలు ఇక్కత్ చీరల ద్వారా జీవనం పొందుతున్నారని తెలిపా రు.పోచంపల్లి చీరల డిజైన్ కూడా ఒక ప్రత్యేకత సంతరిం చుకుందని, భూదానోద్యమంతో భూదాన్ పో చంపల్లి ప్రసిద్ధి పొం దగా, పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో గుర్తిం పు పొందాయని ,2 021లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రపంచ ఖ్యాతి పొందినదాని తెలిపారు.

భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కార్ రెడ్డి మాట్లాడుతూ కొ న్ని శతాబ్దాల నుండి పోచపల్లిలో చీరలు నేస్తున్నారని, ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని , పోచం పల్లి చీరల ప్రక్రియ వి శేషమైన అ ద్భుతమైన ప్రక్రియ అని,పో చం పల్లికి యునెస్కో గు ర్తింపు రావడం ఆశా మాషీ కాదని అన్నారు.జిల్లా యంత్రాంగం ప్రపంచ సుందరీమ ణులను ఇక్కత్ వస్త్రాలతో, బ్యా గులతో సన్మా నించారు.స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ కొర్రా లక్ష్మి, రా చకొండ సిపి సుధీర్ బాబు, డిసిపి అక్షన్స్ యాదవ్, పోచంపల్లి టూరిజం పార్క్ ఎండి ఉపేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.