MlaRajagopalReddy : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, ఇచ్చిన మాట ప్రకారం కాం గ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డు ఇస్తోంది
MlaRajagopalReddy: ప్రజా దీవె న, చౌటుప్పల్: దేశంలో కాంగ్రెస్ పా ర్టీకి గొప్ప చరిత్ర ఉందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ఇప్పటి వరకు అన్ని నెరవేర్చిన చరిత్ర ఆ పార్టీదని మునుగోడు ఎమ్మె ల్యే కో మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Mla Ra jagopalReddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తా మని చెప్పి ఇచ్చిందని, అదేవిధంగా ఎన్నికల సమయంలో ప్రతి పేదవా డికి రేషన్ కార్డు ఇస్తామ ని చెప్పి ఇ ప్పుడు ఇస్తోందని ఆయన గుర్తు చే శారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ( Congress Party) తోనే పేదలకు నిజమైన న్యాయం జరుగుతుందని రాజ గోపాల్ రెడ్డి ఉద్ఘాటించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటు ప్పల్ పట్టణంలోని బీఆర్ కే కన్వే న్షన్ హాల్ లో నూతన రేషన్ కార్డుల పంపిణీ ( Ration Card Distribu tion) కార్యక్రమాని కి ముఖ్య అ తిథిగా హాజరైన ప్రసంగించారు. అంతకుముందు ఆయన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ( Mlc Neklika nti Sathyam)తో కలిసి జ్యోతి ప్ర జ్వలన చేసి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనం గా ప్రారంభించారు. తొలుత చౌటు ప్పల్ మండలం చౌటుప్పల్ మున్సి పాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను స్వయం గా అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏ ళ్లుగా పేద ప్రజలు ఎదురు చూస్తు న్నారని, కులాలకు అతీతంగా పా ర్టీలకతీతంగా నిజమైన లబ్ధిదారు లకు కొత్త రేషన్ కార్డులు అందించ డం చాలా సంతోషంగా ఉందన్నా రు.గత పది సంవత్సరాలుగా చితి కిపోయిన ఆర్థిక వ్యవస్థను బాగు చే సుకుంటూనే నిరుపేదలకు ప్రజా సంక్షేమ పథకాలు కూడా అందిస్తోం దని చెప్పారు.
గతంలో రేషన్ ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యం దళారుల చేతిలోకి వెళ్తుం దని, ప్రభుత్వ ఖర్చు చేసే ప్రతి పైసా నిజమైన పేదవాడికి ఉపయోగక రంగా ఉండాలని సన్నబియ్యం ప థకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభు త్వం అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పే దవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.
ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెం టీలు( Six Promises) ఒక్కొక్క టిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామ ని, అర్హులైన ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జర గొద్దని, రేషన్ కా ర్డలు ఎలా ఇస్తున్నామో ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇ స్తున్నామో రాబోయే కాలంలో అ ర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పి స్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ దృ ష్టికి తీసుకెళ్లి త్వరలో నే పెన్షన్లు ఇప్పిస్తానని, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకి 10 సంవత్సరాలలో నిరాశే మిగిలిం దన్నారు.
ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హా మీలన్నీ తప్పకుండ నెరవేరుస్తామ ని, పదేళ్లు అధికారంలో ఉన్న ఇల్లు లు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇ వ్వలేదు, మహిళలకు ఉచిత ప్ర యాణం ఇవ్వలేదని, దేశానికి స్వా తంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అని కాంగ్రెస్ పార్టీ తోనే పేదలకు నిజమైన న్యా యం జరుగుతుందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మీ ఆశీర్వాదం కాం గ్రెస్ పార్టీ పైన ఉండాలని, మీ జీవి తంలో మార్పు తీసుకొచ్చేది కాం గ్రెస్ పార్టీ మాత్ర మేనని వ్యాఖ్యానిం చారు.
శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ గత ప్రభు త్వం ఒక్క నూతన రేషన్ కార్డు కూ డా ఇవ్వలేదని, కనీసం రేషన్ కా ర్డు ల్లో కొత్త పేర్లు కూడా యాడ్ చేయలే దని గుర్తు చేస్తూ ప్రజా ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉం చుకొని నూతన రేషన్ కార్డులు అం దించడం అభినందనీయమన్నారు.
పేద ప్రజలకు సన్నబియ్యం అందిం చడం మంచి పరిణామమని, గత ప్రభుత్వ మాదిరిగా కక్షపూరితంగా కాకుండా ఈ ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలని అధికారులను కోరా రు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కా నీ రేషన్ కార్డుల విషయంలో కానీ గ త ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవ లం బించిందని విమర్శించారు.
మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి పార్టీలకతీతంగా సంక్షేమ పథ కాలు అందాలని అధికారులకు చె ప్పడం అభినందనీయమన్నారు.
ఎమ్మెల్యే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజల్లో ముందు కె ళ్తున్నారని కితాబునిచ్చారు.