Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Modi: ప్ర‌ధాని మోదీతో విశ్వ విజేత‌లు

–ఒక్కో ఆటగాడిని పేరు పేరునా ప‌ల‌క‌రిస్తూ ప్ర‌త్యేక అభినంద‌న‌లు
–కోచ్ రాహుల్ ద్రవిడ్ తో మాటా మంతి
–కొత్త జెర్సీతో మోదీ వ‌ద్దకు భారత క్రికెట్ జ‌ట్టు

Modi: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ప్రపంచ టి20 క్రికెట్ ఛాంపియన్షిప్ (T20 Cricket Championship)పోటీల్లో భాగంగా వెస్టిండీస్ గడ్డపై జగజ్జేత గా నిలిచి స్వదేశానికి చేరుకుంది భారత్ క్రికెట్ జట్టు(Indian cricket team). వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) 2024 విజేతగా నిలిచిన భారత జట్టు నేడు స్వదే శానికి చేరుకున్న అనంత‌రం ఉద యం 11 గంటలకు ప్రధాని మోడీని భారత ప్లేయర్స్ కలుసుకున్నారు. విశ్వవేదికపై భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ సేనను ప్రధాని అభినందించారు. ప్రధానితో కలిసి ప్లేయ ర్స్ అందరూ అల్ఫాహారం చేశారు. పత్రి ఒక్క ప్లేయర్ ను మోదీ పేరుపే రునా పలకరించారు.

కోచ్ రాహుల్ (Rahul)తో టోర్ని విశేషాలను అడిగి తెలు సుకున్నారు. అయితే మోడీని (modi) కలవ డానికి భారత ఆటగాళ్లు స్పెషల్ జెర్సీలో వెళ్లారు భారత క్రికెటర్లు. టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన జెర్సీ తరహాలోనే ఈ స్పెషల్ జెర్సీ ఉండగా స్వల్ప మార్పులు చేశారు. జెర్సీ ముందు భాగంలో ‘ఇండియా’ కింద ‘ఛాంపియన్స్’ అని అదనంగా ముద్రించారు. టీ20 ప్రపంచకప్‌ 20 24 గెలిచినందుకు ఛాంపియన్స్ అని జెర్సీపై ఆడ్ చేశారు.అలాగే ఎడమవైపు ఉండే బీసీసీఐ (bcci)లోగోపై రెండు స్టార్లను ముద్రించారు. గతం లో ఒక్క స్టార్ మాత్రమే ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్‌ విజయా నికి గుర్తుగా ఆ స్టార్ ఉండేది. ఇప్పు డు టీ20 ప్రపంచకప్‌ 2024 గెలవ డంతో రెండు స్టార్లుగా ఛేంజ్ చేశా రు. ఈ రెండు మినహా టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup)బరిలోకి దిగిన జెర్సీలో మరే మార్పు లేదు. కొత్త జెర్సీకి (New Jersey)సం బందించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతు న్నాయి.