–అప్పుడే ప్రజాస్వామ్యానికి మరింత బలం
–మన్ కీ బాత్‌లో ప్రధాన మంత్రి మోదీ
Modi Mann Ki Baat: ప్రజాదీవెన, ఢిల్లీ: యువత రాజకీయాల్లోకి వస్తేనే ప్రజాస్వామ్యానికి (Democracy) బలం అని ప్రధాని మోదీ (Prime Minister Modi) అన్నారు. వికసిత్ భారత్ (Viksit Bharat) లక్ష్యం దిశగా దేశ పునాదులను పటిష్ఠం చేసే ఎన్నో విషయాలు 21వ శతాబ్దంలో జరుగుతున్నాయని తెలిపారు. 113వ ‘మన్ కీ బాత్ (Mann Ki Baat)’ ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం లేకపోయినా అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. దేశం కోసం వారు తమని తాము పూర్తిగా అంకితం చేసుకున్నారన్నారు.
నేడు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి మనం మరోసారి అదే స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో యువత రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా
ఉన్నారన్నారు. వారికి సరైన అవకాశం, మార్గదర్శకత్వం కావాల్సి ఉందన్నారు. కుటుంబ రాజకీయాలు (Family politics) నూతన ప్రతిభను అణచివేస్తా యని పేర్కొన్నారు. అంతరిక్ష రంగం (Space field)లో భారత్ దూసుకెళ్తాందని గుర్తు చేశారు. చంద్రయాన్ విజయానికి గుర్తుగా స్పేస్ డే (Space day) నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలా సాగింది. తన పిలుపు మేరకు దాదాపు 5 కోట్లకు పైగా మంది జాతీయ జెండాతో ఫొటోలు దిగి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించారు.