— విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
MP Keshineni Shivnath: ప్రజా దీవెన, విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి (Vijayawada Indrakiladri)పై అమ్మ వారి ఆశీస్సులు,ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు కృషి వల్లే డ్రోన్ హాక్ థాన్ ఐదు గిన్నిస్ రికా ర్డులు నమోదు చేసుకుందని విజ యవాడ ఎంపి కేశినేని శివనాథ్ (MP Keshineni Shivnath) అన్నారు. ఇంద్రకీలాద్రి కొలువు దీరిన కనకదుర్గ అమ్మవారిని కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనా థ్ (MP Keshineni Shivnath) , అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ , మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, యల మంచిలి ఎమ్మెల్యే సుందరపు విజ య్ కుమార్ బుధవారం దర్శించుకున్నారు.ఆలయ మర్యాదలతో ప్రజాప్రతినిధులందరికీ ఆలయ ఈవో కె.ఎస్.రామారావు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనం తరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి వారికి తీర్థప్రసాదాలు అందజేయగా, ఆలయ ఈవో అమ్మ వారి చిత్రపటాలు బహుకరిం చారు.
అమ్మవారి అనుగ్రహం, సీఎం చంద్రబాబు సంకల్పం వల్లే దేశంలో మొదటిసారి ఇంత పెద్ద స్థాయిలో డ్రోన్ సమ్మిట్ (Drone Summit)-2024 అమరావతి రాజధాని లో ఏర్పాటు చేయటం జరిగిందని కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభి క్షంగా, సుఖ సంతోషాలతో జీవిం చేలా అమ్మవారి కరుణా కటాక్షా లు వుండేలని వేడుకున్నట్లు ప్రజా ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి, జన సేన, బిజెపి నాయకులు, కార్యకర్త లు పాల్గొన్నారు.