Marriage: పెళ్ళిలో తాటిముంజలు సందడి
వివా హ మహోత్సవం, రీసెప్సన్ లలో బంధువులు, అతిథులకు విందులో భాగంగా రకరకాల తినుబండారా లు అందుబాటులో ఉంచడం పరి పాటి
ఆహ్వానితులకు సమ్మర్ స్పెషల్ ఐటం గా ముంజలు
ఇంకా బయట అందరినీ ఆకట్టుకుంటున్న వీడియో
ప్రజా దీవెన, ఇబ్రహీంపట్నం: వివా హ మహోత్సవం(marriage), రీసెప్సన్ లలో(reception) బంధువులు, అతిథులకు విందులో భాగంగా రకరకాల తినుబండారా లు అందుబాటులో ఉంచడం పరి పాటి. ఆయితే అందరూ సహజంగా స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇతర ఇతర మిఠాయిలు అందుబా టులో ఉంచి తనివి తీరా ఆస్వాదిం చేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఓ ఓ పెళ్లి కుటుంబం వినూత్న తరహాలో ఆలోచన చేయడంతో పాటు ఆచర ణలో పెట్టింది. అసలే సమ్మర్ సీజన్ కావడంతో ఎండలో వచ్చిన అతిథులను చల్లగా ఆకర్షించేం దుకు తద్వారా కూల్ చేసేందుకు ఐస్ ఆపిల్ గా పిలుచుకునే స్వచ్ఛ మైన తాటిముంజలను ఏర్పాటు చేసి అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేశారు.
కేవలం గ్రామాల్లోనే అందుబాటులో ఉండే ఈ తాటి ముంజలు హైద రాబాద్ లో అందు లోనూ పెళ్లి రిసెప్షన్(Reception) లో ప్రత్యక్షం కావడంతో చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా ఎగబడి మరి తిన్నారు. మన్నెగూడలోని బీ ఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్ లో జరిగిన ఓ పెండ్లి రిసెప్షన్లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యం పోవడం ఒక ఎత్తు అయితే అంతకుమించిన ఆనందం వ్యక్తం చేస్తూ పెళ్లివారికి అభినందనలు తెలియజేస్తున్నారు.
Munjalu in Marriage