MV Ramana Goud: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేజీ కేఏస్ అధ్య క్షులు ఎంవి రమణ గౌడ్ (MV Ramana Goud) ఆధ్వర్యం లో నిర్వహించిన కల్లు గీతా కార్మిక సంఘం (Geetha Labor Union) 67వ వార్షికోత్సవ ఉత్సవా లలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్లలో కల్లుగీత వృత్తి లో ఉపాధి పై బుక్ లెట్ ను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్మభిక్షం ఆధ్వ ర్యంలో కార్మికుల పక్షాన కల్లుగీత కార్మిక సంఘం ఏర్పాటు చేసి కార్మి కులను సంఘటితం చేయడం జరిగిందని తెలిపారు. గత ఎన్నో సంవత్సరాలుగా కల్లుగీత కార్మికుల రెంటల్, కార్మికులపై దాడులపై ఎన్నో పోరాటాలు చేయడం జరి గిందని గుర్తు చేశారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుండి నిజాం ప్రభుత్వం లో కూడా రెంటల్ లను వసూలు చేసే వారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక పది సంవ త్సరాలలో గీత కార్మికులకు రెంటల్ (Rental to Gita workers) ను పూర్తిగా రద్దు చేసి నాలుగు కోట్ల పై చిలుకు చెట్లను నాటడం జరిగిందని వివరించారు. కల్లు దుకాణాలపై దాడులను అరి కట్టడం జరిగిందని, వైన్ షాప్ లలో 15 శాతం రిజర్వేషన్లను గౌడ్ లకు వర్తింపచేయడం జరిగిందని అన్నా రు. కల్లుగీత వృత్తిదారులు (Kallu Geeta Professionals) ఆత్మ గౌరవంగా బ్రతకడం కొరకు హైద్రా బాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద నీరా కేఫ్ ను ఏర్పాటుచేయడం జరిగిం దన్నారు. దర్మబిక్షం పేరుతో నీరా సెంటర్ ను నందనం, చరికొండలో ఏర్పాటు చేశామని తెలిపారు. రా ష్ట్రంలో గీత కార్మికులపై దాడుల చేసి, కేసులు పెట్టి, బైండోవర్ చేస్తు న్నారని ఆరోపించారు.
తెలంగాణ లో జిల్లాకు సర్ధార్ సర్వాయి (Sardhar Sarvai) పాప న్న పేరును పెడతామని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరి గిందని, అదేవిధంగా ధర్మభిక్షంగారి పేరును ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమ యంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేసే దిశలో సంఘాల పోరాటం చేయాలని దిశా నిర్దేశం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట నర్స య్య, బెల్లంపల్లి వెంకటేశ్వర్లు, కృ ష్ణా స్వామి గౌడ్, కల్లు గీత కార్మి కుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.