IndiaOpinionతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

nalgonda collector chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశం,ఎల్‌నినో ప్రభావంతో తాగు నీటిఇబ్బందులు లేకుండా చర్యలు

nalgonda collector chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్‌నినో ప్ర భావంతో జిల్లాలో ఆశించిన స్థాయి లో వర్షపాతం లేకపోవడంతో తాగునీటి సమస్యలు తలెత్త కుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాల య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర మంలో ప్రజల నుండి విన తులు స్వీకరించిన అనంతరం జి ల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షా భావ పరిస్థితులు ఉన్నం దున జి ల్లాలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ము ఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పా ఠశాల లు, హాస్టళ్లు, ప్రాథమిక ఆ రో గ్య కేంద్రాల్లో తాగునీటి కొరత లే కుండా చర్యలు తీసుకోవాలని ఆ దేశించారు.మండల స్థా యి అధికారులు ప్రతి రెండు వారాలకు ఒక సారి హాస్టళ్లు, పీహెచ్‌సీలు, అంగ న్‌వాడీ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేసి, వాటి నివేదికలను స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు క లెక్టర్ సమర్పించాలని సూచించారు.

పాఠశాల విద్యార్థుల యూనిఫాం ను ఈ నెల 15వ లోగా రె సిడెన్సి యల్ పాఠాశాలల బాలికలకు పంపిణీ పూర్తి చేయా లని అధికారులను ఆదేశించారు. కాగా ఈ సోమవారం మొ త్తం 105 దరఖాస్తు లు రాగా, రెవెన్యూ శాఖ కు 55, తక్కిన శాఖలకు 50 వచ్చాయి. రె విన్యూ అదనపు కలెక్ట ర్ జే. శ్రీని వాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జిల్లాఅధికారులు, తది తరు లు ప్రజల వద్ద నుండి దరఖాస్తుల స్వీకరించారు.

తప్పులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా భూ ముల రీసర్వే

నల్లగొండ: ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పారద ర్శకంగా భూముల రీసర్వేను నిర్వహించా లని జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ సర్వేయర్లను ఆదేశించారు. సోమవారం ఎన్జీ కళాశాలలో భూముల రీసర్వే విషయమై సర్వేయర్లకు ఏ ర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

సర్వేయర్లు సర్వే నిర్వహించే సమ యంలో గతంలోని సర్వే రికార్డుల ను ఆధారం చేసుకుని సర్వే నిర్వ హించాలని, సర్వే నంబర్ ట్యాలీ చేసుకుని నిర్ధారణకు వచ్చిన త ర్వాత సర్వే చేయాలన్నారు. టీప న్ మ్యాప్ కూడా సర్వే సమయం లో దగ్గర ఉంచుకోవాలని, సర్వేలో ఎలాంటి సమస్యలు ఉ త్పన్నం కాకుండా చూడాలన్నారు .సర్వేలో తప్పిదాలు జరి గితే కోర్టు కేసులు న మోదయ్యే ఆస్కారం ఉంటుందని, అం దువల్ల పూర్తి అత్యంత అప్రమ త్తంగా ఉంటూ సర్వే నిర్వ హించాల్సిన అవసరం ఉందన్నారు.

ఒక గ్రామంలో సర్వే నిర్వహించే స మయంలో ప్రభుత్వ భూ ములు, పట్టా భూములు, ప్రాజెక్టుల కింద ఉన్న భూములు, అలాగే గ్రామకంఠం, గ్రామపంచాయతీ , మున్సిపల్ భూ ములు అన్నింటిని దృష్టిలో ఉంచుకొని సర్వే నిర్వహించాల న్నారు. సర్వేలో చైన్ మరియు రోవర్ లను ఉపయోగించా లని, చట్టం ప్రకారమే నియమనిబంధనలను అతిక్రమించ కుండా సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. రె విన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ తదితరులు జిల్లా కలె క్టర్ వెంట ఉన్నారు.

Related Articles

Back to top button