–కేంద్ర జలశక్తి అభియాన్ సెక్రటరీ దివాకర్ మహంతా బృందం
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలో జలశక్తి అభియాన్ (Jal Shakti Abhiyan)పనులు బాగుండడం పట్ల కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ వేదవీర్ ఆర్య సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పనుల పరిశీలన నిమిత్తం మూడు రోజుల జిల్లా పర్యటన లో భాగంగా కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ బృందం శాస్త్ర వేత్త దివాకర్ మహంతాతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాల యంలో జిల్లా కలెక్ట ర్ సి. నారాయణరెడ్డి (Narayana Reddy) తో సమావేశమైంది. ఈ సందర్భంగా జల శక్తి అభియాన్ పథకం కింద నల్గొండ జిల్లాలో చేప ట్టిన పనులను జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరిం చారు.
జిల్లాలో జలశక్తి అభియాన్ పనులను ఇంకా పెద్ద ఎత్తున చేపడుతామని , నూరు శాతం పనులను విజయవంతం చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపా రు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power point presentation) సందర్భంగా జల శక్తి అభి యాన్ పై డిఆర్డిఏ నాగిరెడ్డి వివరిం చగా, తాగునీటి అంశాలపై ఆర్డ బ్ల్యూఎస్ ఈ వెంకటేశ్వర్లు, వ్యవసా య శాఖ పై జిల్లా వ్యవసాయ అధి కారి శ్రవణ్, ఉద్యాన అంశాలపై జిల్లా హార్టికల్చర్ అధికారి సంగీ తలక్ష్మి వివరించారు. అనంతరం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (Rural Development Officer)కార్యాలయంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమం లో కేంద్ర బృందం పాల్గొంది. అనంతరం నకిరేకల్ మండలం చందుపట్ల గ్రా మంలో రహదారుల కు ఇరు వైపుల నాటిన మొక్కలు, నర్సరీ, మ్యాజిక్ సోక్ పిట్లు,క మ్యూనిటి సోక్ పిట్లు, ఓపెన్ వెల్స్ ను కేంద్ర బృందం పరిశీ లించిం ది .
అలాగే డిసి ల్టింగ్, అమృథ్ సరోవర్, ఫిష్ పాండ్ ల (Desilting, Amrit Sarovar, Fish Pond) ను తనిఖీ చేసింది. నార్కె ట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లేము లలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను పరిశీలిం చింది.కురిసిన ప్రతి నీటి బొట్టును భూమిలో ఇంకిం పజేయా లన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం జల శక్తి అభియాన్ పథకం తీసుకు వచ్చింది. జలశక్తి అభియాన్ కింద దేశవ్యాప్తంగా 151 జిల్లాలలో పను లు చేపట్ట నుండగా నల్గొండ జిల్లా (nalgonda) సైతం ఈ పథకానికి ఎంపి కైంది. 2019 నుండి జిల్లాలో ఈ పథకం కింద పనులు చేయడం జరుగు తున్నది. ఇందు లో భాగంగా పనుల సక్రమ నిర్వహ ణ తీరును పరిశీలిం చేందుకు బృందం జిల్లాకు వచ్చిం ది. మూడు రోజుల పర్య టనలో భాగంగా ఈ బృందం శనివారం దేవరకొండ ప్రాంతంలో నీటి నిల్వ కట్టడాలను పరిశీ లించనుంది. ప్రత్యేకించి చెక్ డ్యా ములు, ఊట కుంటలు, గల్లి కంట్రోల్స్ తదితర వాటిని ఈ బృందం పరిశీలిస్తుంది.కాగా ఈ కార్యక్రమాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, డిఆర్ఓ డి. రాజ్యలక్ష్మి, వివిధ శాఖలకు చెందిన అధికారు లు సిబ్బంది పాల్గొన్నారు.