Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 5:41 am Posted by : prajadeveena.com

Pahlaj Nihalani Passes Away at 76 : పహలాజ్ నిహలానీ మృతి.. బాలీవుడ్‌లో విషాదం

Pahlaj Nihalani Passes Away at 76: బాలీవుడ్ ప్ర ముఖ నిర్మాత, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎ ఫ్‌సీ) మాజీ చైర్మన్ Pahlaj Nihalani ఇక లేరు. 76 ఏళ్ల వ యసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతు న్న నిహలానీ ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించినట్లు కు టుంబ సభ్యులు తెలిపారు.

ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి చేరు కున్న ఆయన, గురువారం తన నివాసంలోనే కన్నుమూశా రు. ఆయన మరణ వార్తతో బాలీవుడ్ సినీ వర్గాలు తీ వ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. శాంతాక్రూజ్‌లోని హిందూ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.

1980, 1990 దశకాల్లో వాణిజ్య చిత్రాల నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహలానీ, అనేక సూపర్ హిట్ చిత్రాల ను ప్రేక్షకులకు అందించారు. ముఖ్యంగా Govinda కెరీర్‌కు మైలురాళ్లుగా నిలిచిన పలు చిత్రాల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే అగ్ర హీరోలతో మాస్ ఎంట ర్‌టైనర్‌లను తెరకెక్కించి నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థా నాన్ని సంపాదించుకున్నారు.

Also Read: NDA Government NH : తెలంగాణ రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీ వరం.. రూ.7597 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం

1982లో నిర్మాతగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నిహలానీ, అనేక వాణిజ్య విజయాలను అందుకున్నారు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలను రూపొంది స్తూ బాలీవుడ్‌లో సుదీర్ఘకాలం తన ముద్ర వేశారు.సినీ రంగంలోనే కాకుండా పరిపాలనా బాధ్యతల్లోనూ ఆయన సేవలందించారు. 2015 నుంచి 2017 వరకు సీబీఎఫ్‌సీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయా లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

చిత్రాల సె న్సార్ విషయంలో ఆయన అనుసరించిన కఠిన వైఖరి అ ప్పట్లో సినీ పరిశ్రమలో విస్తృత చర్చకు దారితీసిం ది.నిహలానీ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. Chunky Pandey, Anees Bazmee సహా పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.