Pakcoustodyjawanrealesd: ప్రజా దీవెన, న్యూఢిల్లీ : దా యాది పాకిస్తాన్ భారత సైన్యం మధ్య యుద్ధం సమయంలో పాక్ రేంజర్ల అదుపులో ఉన్న బిఎస్ఎఫ్ జ వాన్ పూర్ణమ్ కుమార్ షాను ఆ దేశం తిరిగి భారత్ కు బుధవారం అప్పగించింది. అటారీ-వాఘా బార్డర్ ద్వారా అతడిని మనదేశానికి పంపింది. గత నెల 23న పాక్ సరిహద్దులోకి అనుకోకుండా ప్రవేశిం చిన జవాన్ ను పాక్ అదుపు లోకి తీసుకున్న విషయం తెలిసిందే.
తన భర్త తిరిగొచ్చేలా చూడాలని ఆయన భార్య ఇటీవల కేంద్ర ప్ర భుత్వాన్ని వేడుకున్నారు. దీనిపై పాక్ రేంజర్లతో భారత్ అధికారులు చర్చలు జరిపారు. సదరు చర్చలు ఫలప్రదం కావడంతో పూర్ణమ్ కు మార్ ను విడుదలయ్యారు.