— దేశంలో మహిళలపై నేరాలను సహించబోము
–మహారాష్ట్ర లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో ప్రధాని మోదీ
PM addresses Lakhpati Didi: ప్రజా దీవెన, జలగావ్: మహిళలపై పెరుగుతున్న నేరాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక ప్రకటన చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితిల్లోనూ వారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. మహారాష్ట్రలోని జలగావ్‌లో ఆదివారంనాడు జరిగిన ‘లఖ్‌పతి దీదీ (Lakhpati Didi)’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై నేరాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలను రూపొందిస్తున్నామని చెప్పారు.
దేశంలో గత రెండు వారాల్లో మహిళలపై అకృత్యాల (Atrocities against women) ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కోల్‌కతా (Kolkata)లో వైద్య విద్యార్థిని (Medical student)పై అత్యాచారం, హత్య (Rape and murder) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఆ వెంటనే బద్లాపూర్ పాఠశాలలో లైంగిక వేధింపుల ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది.
కాగా, ‘లఖ్ పతి దీదీస్’ కార్యక్రమంలో ఏటా లక్ష రూపాయలు ఆదాయం పొందుతున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలతో మోదీ ముఖాముఖీ సంభాషించడంతో పాటు, 11 మందిని సన్మానించారు. రూ.5000 కోట్ల బ్యాంకు రుణాలను సైతం ఈ సందర్భంగా ఆయన పంపిణీ చేశారు. ఇందువల్ల 25.8 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులు లబ్ది పొందుతారు. మూడు కోట్ల మందిని లఖ్‌పతి దీదీలుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.