Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Police traffic restrictions: ఆదివారం హైదరాబాద్ లో ఆంక్షలు

–సిటి పోలీస్ యంత్రాంగం ఆదేశాలు జారీ

Police traffic restrictions: ప్రజా దీవెన, హైదరాబాద్: పాతబస్తీలో (old town) ఆది వారం జరగనున్న లాల్ దర్వాజా మహాకాళి బోనాల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిం చారు. బోనాల సంద ర్భంగా ఛత్రి నాక ప్రాంతంలో, లాల్ దర్వాజా సింహవాహిని (Lal Darwaja Simhavahini) శ్రీ మహాకాళి అమ్మ వారి ఆలయం వద్ద నుంచి అక్కన్న మాదన్న టెంపుల్ వరకు ఏనుగుపై ఘటాల ఊరే గింపు ఉంటుంది.ఈ నేపథ్యంలో 28, 29 తేదీ ల్లో ఫలక్ నుమా, చార్మినా ర్, మీర్ చౌక్, బహదూర్ పురా (Falak Numa, Charmina R, Mir Chowk, Bahadur Pura)పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో, నయా పూల్ నుంచి అక్కన్న మాదన్న టెంపు ల్ వరకు వాహనాల రాక పోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

28 ఆదివారం తెల్లవారు జామున 4గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సింహవాహిని శ్రీ మహాంకాళి లాల్ దర్వాజా టెంపుల్ రోడ్ (Lal Darwaza Temple Road) వైపు నెహ్రూ విగ్రహం లాల్ దర్వాజా నుండి ట్రాఫిక్ అనుమతించబడదు.హిమ్మత్‌పురా, షంషీర్‌గంజ్‌ వైపునుంచి వచ్చే వాహ నాలను నాగుల చింత, గౌలిపురా వైపు పంపుతారు.చాంద్రాయణగుట్ట, కందికల్‌ గేట్‌ ఉప్పుగూడ వైపు నుంచి వచ్చే వాహనాలను లాల్ దర్వాజ వైపు అనుమతించరు. ఛత్రినాక ఔట్‌పోస్ట్‌ వద్ద గౌలిపుర, నాగుల చింత వైపు పంపుతారు.29 సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.
(traffic)
మహబూబ్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వాహనాలను ఇంజన్ బౌలి (The engine bowl of the vehicles) వద్ద జహానుమా, గోశాల, తాడ్ బాన్ లేదా గోశాల మిస్రీగంజ్, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు. ఇంజిన్ బౌలి నుంచి వచ్చే ట్రాఫిక్ షంషీర్ గంజ్ వద్ద మళ్లిస్తారు. పంచ మొహల్లా చార్మినార్ నుండి ట్రాఫిక్ నాగుల్చింత వైపు అను మతించ బడదు. ఆ వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్, మిస్రిగంజ్ వైపు మళ్లిస్తారు.చాదర్‌ఘాట్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను సాలార్‌జంగ్ మ్యూజియం రోడ్డు వైపు అనుమతించరు. SJ రోటరీ వద్ద పురాణి హవేలీ రోడ్, శివాజీ బ్రిడ్జ్, చాదర్‌ఘాట్ వైపు మళ్లిస్తారు.

అదేవిధంగా మీర్‌చౌక్, మొఘల్‌పురా నుండి వచ్చే ట్రాఫిక్‌ను (traffic)హరిబౌలి వైపు అనుమతించరు. మీర్ కా దైరా వద్ద మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ వైపు మళ్లిస్తారు. ఖిల్వత్/మూసబౌలి నుండి వచ్చే ట్రాఫిక్ లాడ్ బజార్ వైపు అనుమతించబడదు. మోతిగల్లి టీ జంక్షన్ వద్ద ఖిల్వత్ ప్లే గ్రౌండ్, మూసా బౌలి వైపు మళ్లి స్తారు. ఖిల్వత్ ప్లే గ్రౌండ్ నుండి వచ్చే ట్రాఫిక్ హిమ్మత్‌పురా వైపు అనుమతించబడదు. ఓల్గా జంక్షన్ వద్ద ఫతే దర్వాజా, మిస్రిగంజ్ వైపు మళ్లించబడుతుంది.

పార్కింగ్ ప్రాంతాలు..
అలియాబాద్ వైపు నుంచి ద్విచక్ర వాహనాలపై వచ్చే భక్తులు తమ బైక్ లను అల్కా థియేటర్, దేవి ప్లైవుడ్ వద్ద నిలపాల్సి ఉంటుంది.హరిబౌలి గౌలిపురా వైపు నుంచి వచ్చే వాహనాలను సుధా థియేటర్ లైన్ లో పార్కింగ్ చేసుకోవాలి.మూసాబౌలి, మీర్ చౌక్ వైపు నుంచి వచ్చేవాహన దారులు తమ వాహనాలను చార్మినార్ బస్ టెర్మినల్ వద్ద నిలుపసుకోవాలి. అంబారీ ఊరేగింపు సందర్భంగా మదీనా క్రాస్ రోడ్స్, ఇంజన్ బౌలి, గుల్జార్ హౌస్, చార్మినార్, హిమ్మత్ పురా, నాగులుచింత రోడ్లపై ఎలాంటి వాహనాలను అమతించరు.