విధుల్లోని పోలీస్ కానిస్టేబుల్ కు గుండెపోటు
Policeconstable: ప్రజా దీవెన, హైదరాబాద్: సంక్రాంతి పర్వ దినాన విధులు ని ర్వర్తిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ కు అకస్మాత్తుగా గుండెపోటు వ చ్చింది. హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేష న్‌లో హెడ్ కాని స్టేబుల్ వినయ్ భాస్కర్ విధులు నిర్వహిస్తున్న సమ యంలో ఉన్న ఫళంగా ఫిట్స్ రావడంతో తోటి సిబ్బంది వెనువెంటనే అతన్ని వెల్ నెస్ హాస్పిటల్‌కు తరలించారు.
పరీక్షించిన వైద్యులు గుండె పోటు వచ్చిందని నిర్ధారించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే ఈ నెల 16వ తేదీ అర్థరాత్రి 12:37 గంటల ప్రాంతంలో రెండోసారి గుం డెపోటు రావడంతో మృతి చెంది నట్లు వైద్యులు వెల్లడించారు. గుండె పోటు తీవ్ర స్థాయిలో రావ డంతో కాపాడలేక పోయామని ఆసుపత్రి వైద్యులు చెపుతున్నారు.