Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 1:46 pm Posted by : praja deveena

Puri Jagannath Rath Yatra tragedy : బిగ్ బ్రేకింగ్, పూరి జగన్నాథుడి రథోత్సవంలో పెను ప్రమాదం, తొక్కిసలాటలో ఒకరి మృతి

Puri Jagannath Rath Yatra tragedy : ప్రజా దీవెన, పూరి: ఆధ్యాత్మిక నగరమైన పూరిలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. జగన్నా థుడి వార్షిక రథయాత్ర మహోత్స వంలో అనూహ్యంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒక రు ప్రాణాలు కోల్పోగా, 120 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భక్తిపారవశ్యంతో సాగాల్సిన ఉత్సవం, క్షణ కాలంలో భీతావ హంగా మారిపోయింది. శ్రీకృష్ణుడు, బల భ ద్రుడు, సుభద్ర దేవిల ను గర్భగుడి నుంచి రథాల వైపునకు తీసుకొచ్చే అత్యంత పవిత్రమైన ‘పహండీ’ వేడుక ప్రారంభ మైంది. ఆ సమయంలో స్వామి వారిని కళ్లారా చూడాలనే ఆరాటంతో, రథాల వైపు భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చా రు.

     రికార్డు స్థాయి జనసందోహం

ఈ ఏడాది రథయాత్రకు దాదాపు 10లక్షల మందికి పైగా భ క్తులు తరలివచ్చారు. విపరీతమైన భ క్తుల రద్దీ కారణంగా పరిస్థితి క్ష ణాల్లో అదుపు తప్పింది. ఒకరినొ కరు తోసుకుం టూ ముందుకు రావడంతో ఊపిరాడక చాలామంది ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

 

      క్షణాల్లో తొక్కిసలాట

కిందపడిపోయిన వారిపై నుంచి జనాలు దూసుకుపోవడం తో పలువురికి తీవ్రగాయాలయ్యా యి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అత్యవసర ప్రత్యేక సహాయక బృం దాలు (Speci al Emergency Rescue Teams) రంగం లోకి దిగాయి. గాయ పడిన భక్తులను బారికేడ్ల మధ్య నుం చి సురక్షితంగా బయటకు తీసి, స్థానిక ఆసుపత్రులకు తర లించారు.

ప్రస్తుతం క్షతగాత్రులకు అత్యవ సర వైద్య సేవలు అందుతు న్నాయి.ఈ ఊహించని సంఘటన తో పూరి వీధులు ఒక్క సారిగా ఆ క్రందనలతో నిండిపోయాయి. ప్రస్తుతం భద్రతా బ లగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తు న్నాయి.