–తెలంగాణలో కొనసాగుతున్న వర్షాలు
–మరో మూడు రోజుల పాటు కురువనున్న వానలు
–తెలంగాణ లో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Rains: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో (telangana) రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశా లున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (weather station) వెల్లడించింది. తెలంగాణలో ని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకా శాలున్నట్లు కూడా పేర్కొంది. మరి కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని వాతా వరణశాఖ పేర్కొంది. శని, ఆదివారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy rains) పడ్డాయి. హైదరాబాద్‌లో కూడా శని, ఆదివారాల్లో వానలు కురిశాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవ ర్తనం నైరుతి దిశగా కొనసాగు తోంది. ఈ అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురు స్తాయని అంచనా వేస్తోంది.
కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకా శం ఉందని తెలిపింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు బలమైన ఈదురుగాలులు, ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, పెద్దపల్లి, జగిత్యాల, మహ బూబాబాద్, కరీంనగర్, భూపా లపల్లి, ములుగు, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా వికారా బాద్ జిల్లా తాండూరులో 5.1 సెంటీ మీటర్లు, నిజామాబాద్ జిల్లా పొతంగల్‌లో 4.8 సెంటీ మీటర్లు, నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ 4.8, బాసర 4.3, నిజామాబాద్ జిల్లా బోధన్ మండ లం కల్దుర్కి 3.9 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. ఆదివారం జోగులాంబ గద్వాల, వనపర్తి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వానలు కురిసాయి.