— రాజ్ తరుణ్, మాల్వి తో పాటు ఆమె సోదరుడు మయాంక్ పైనా
Raj Tarun:ప్రజా దీవెన, హైదరాబాద్: నటుడు రాజ్‌తరుణ్ (Raj Tarun)తనను మోసం చేశా డంటూ నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో లావణ్య చేసిన ఫిర్యాదు నేపథ్యం లో పోలీసులు కేసు (police case) నమోదు చేశా రు. రాజ్‌తరుణ్‌కు తనకు 2014 మే 11న పెళ్లయిందని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. తమ వివా హానికి ఇరువైపులా పెద్దలు సమ్మ తించారని ఇద్దరం కలిసి కాపురం కూడా పెట్టామని వెల్లడించింది. 2016లో తనకు రెండు నెలల గర్భo అబార్షన్ (Abortion) జరగ్గా ఖర్చులన్నీ రాజ్‌త రుణ్ చెల్లించినట్టు తెలి పింది. తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకుం దామని తాను పలుమార్లు కోరినప్పటికీ రాజ్‌తరుణ్ పట్టించుకోలేదని 2018 నుంచి ఎక్కువగా బయట ఉంటున్న రాజ్‌తరుణ్ గురించి ఆరా తీయగా అతను వివాహేతర సం బంధం కొనసాగిస్తున్నట్లు తెలి సిందని ఫిర్యాదులో పేర్కొంది.
రాజ్‌తరుణ్‌తో (raj tharun)ఒక సినిమాలో కలిసి నటించిన మాల్వి మల్హోత్రా అనే యువతి తమ జీవితంలో ప్రవేశించినప్పటి నుంచీ అతడు తనను దూరంగా ఉంచుతున్నా డని అదేమని అడిగితే జైలుకు పంపిస్తానంటూ బెదిరింపులకు దిగాడని వాపోయింది. మాల్వి సోదరుడు మయాంక్ మల్హోత్రా కూడా తనను అసభ్య పదజాలంతో (foul language) దూషిస్తూ బెదిరింపులకు పాల్పడి నట్లు తెలిపారు. అలాగే ఇప్పటి వరకూ తాను రాజ్‌తరుణ్‌కు రూ.70లక్షలు ఇచ్చినట్లు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ను పెళ్లి చేసుకుని మోసం చేయ డమే కాకుండా మానసికంగా వేధి స్తున్న భర్త రాజ్‌తరుణ్‌తో (rajtharun) పాటు బెదిరిస్తున్న మాల్వి, మయాంక్‌లపై (Malvi, Mayank)చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశా రు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీ సులు రాజ్‌తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.