Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: రుణమాఫీకి కౌంట్ డౌన్..!

–నేడో, రేపో ఏ క్షణమైనా ఉత్తర్వుల జారీకి అవకాశం
–లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత గ్రా మ స్థాయి అధికారులకు అప్పగింత
–పద్దెనిమిది మాసాల స్వల్పకాలిక రుణాలకే మాఫీ వర్తింపు

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రైతు రుణమాఫీకి (Farmer loan waiver) కౌంట్ డౌన్ ప్రారం భమైంది. రేపో మాపో ఏ క్షణంలో నైనా ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఆయా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏది ఏమైనా అన్నది అన్నట్టుగా పంద్రా గస్టులోగా రూ.2 లక్షల్లోపు రుణ మాఫీ చేసి చూపించేందుకు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి (revanth reddy) కంకణ బద్ధుడై ఉన్నట్లు ముమ్మర కసరత్తు పూర్తి చేశారు. ఆ మేరకు అధికారులు విధివిధానాలపై కసరత్తు పూర్తి చేసిన నేపథ్యంలో నేడోరేపో మార్గ దర్శకాలను వివరించే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. ప్రాథమిక అంచనా మేరకు రూ.2 లక్షల్లోపు రుణమాఫీ చేయడానికి రూ.31 వేల కోట్ల మేర నిధులు అవ సరం కాగా ప్రభుత్వం ఆ దిశగా నిధుల వేటను కొనసాగిస్తూనే రైతు భరోసాకు కేటాయించిన బడ్జెట్‌ను రూ.7,500 కోట్లను రుణమాఫీకి మళ్లించేoదుకు చర్యలు తీసుకుం టోంది. రైతుభరోసా (Farmer insurance) విధివిధానాలు ఇంకా తుది రూపు దిద్దుకున్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టతకు వ చ్చే అవకాశం ఉంది. ఈ నిధులతో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించా లని సర్కారు కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయా వర్గాలు పేర్కొంటు న్నాయి.

ప్రస్తుతానికి పాత మార్గదర్శ కాల తోనే.. రుణమాఫీలో ( loan waiver) లబ్ధి దారుల ఎంపికకు దాదాపుగా పాత మార్గదర్శకాలనే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచా రం. గత ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసినప్పుడు అవ లంబించిన నిబంధనలనే అధికా రులు లబ్ధిదారుల ఎంపికకు ప్రామా ణికంగా తీసుకుంటారని తెలుస్తోం ది. ఇప్పటికే రూ.2 లక్షల్లోపు రుణ మాఫీకి కటాఫ్‌ తేదీని ప్రభుత్వం ప్రక టించగా 2018 డిసెంబరు 12 నుం చి 2023 డిసెంబరు 9వరకు రుణా లు తీసుకున్నవారికే మాఫీ చేయ నున్నారు. అందులోనూ కేవలం 18 నెలల కాలవ్యవధితో స్వల్పకాలిక పంటరుణాలై ఉండాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక పంటరుణాలకు ఈ పథ కం వర్తించనందున కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని, రుణమాఫీ చేయనున్నారు. కుటుంబాన్ని గుర్తిం చడానికి రేషన్‌ కార్డును ప్రామాణి కంగా తీసుకొని పంచాయతీ అసిస్టెంట్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారులు (Assistant Extension Officers), పంచాయతీ కార్యదర్శులు అర్హుల కుటుంబాలను గుర్తించేందుకు బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రక్రియను తహసీల్దార్లు, ఎంపీడీ వోలు, మండల వ్యవసాయ అధికా రులు పర్యవేక్షిoచనుండగా రైతుల కు ఎన్ని బ్యాంకుల్లో అప్పులున్నా గరిష్ఠంగా ఒక కుటుంబానికి 2లక్షల వరకే మాఫీ వర్తిస్తుంది. అసలు, వడ్డీ, రెన్యువల్‌ రుణాలు కలిపి కుటుంబానికి .

2లక్షల్లోపే మాఫీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు (Government departments)స్పష్టం చేస్తున్నాయి. ఉద్యాన పంట లపై తీసుకున్న రుణాలకూ ఈ పథ కాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా మూడు ఫార్మాట్లలో లబ్ధిదారుల వివరాలను సేకరిం చనున్నారు. అనెక్సర్‌–ఏ, బీల్లో ఉన్నటువంటి రైతుల (farmers) వివరాలు క్రోడీకరించి అనెక్సర్‌–సీలో పొందు పరుస్తారు. ఈ ఫార్మట్లతో బ్యాంకు మేనేజర్లు తమ వద్ద ఉన్న వివరాల ను పోల్చిచూసుకుంటారు. ఈ మూ డు ఫార్మాట్లలోని వివరాలు లీడ్‌ బ్యాంకు మేనేజర్ల ద్వారా సంబంధి త జిల్లా కలెక్టర్లకు చేరుతాయి. డూ ప్లికేషన్‌, డబుల్‌ పేమెంట్‌ వంటి సమస్యలను అధిగమించేందుకు మండల స్థాయిలో సంయుక్త బ్యాం కర్ల కమిటీలు పనిచేస్తాయి. ఈ కమి టీలు అన్ని బ్యాంకుల్లో రుణాల వివరాలను క్రోడీకరిస్తాయి. నకిలీ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలతో తీసు కున్న రుణాలను గుర్తించి చివరి దశలో జిల్లా సహకార ఆడిటర్లు, డీసీసీబీలు, బ్యాంకులు పంపే వివ రాలను వ్యవసాయ శాఖ ఐటీ విభాగం స్క్రూటినీ చేసి, పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తుంది. లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీలు, బ్యాంకుల వద్ద ప్రదర్శిస్తారు. ఆ జా బితాలపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే పరిగణనలోకి తీసుకుని తగు చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు.