–స్వయం సహాయక సంఘాల మహిళలకు సహకారం
–సంఘంలో మహిళ మరణిస్తే ఇకపై బీమా కంపెనీ బాధ్యత
–త్వరలోనే బీమా కంపెనీలతో సర్కారు ఒప్పందం
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ మహిళలకు మరింత మద్దతు పలికేందుకు రేవంత్ (Revanth Reddy) సర్కార్ సమా యత్తమవుతోంది. కాకపోతే సమస్త మహిళా (woman) లోకంకు కాకుండా స్వ యం సహాయక సంఘంలోని మహి ళలకు ఈ సరికొత్త ఆనందం దక్క నుంది. స్వ యం సహాయక సంఘం లోని ఎవరైనా అనుకోని సందర్భం లో మరణిస్తే వారు తీసుకున్న రు ణాన్ని చెల్లించేందుకు పేద కుటుంబాలు(Poor families) అవస్థలు పడాల్సి వచ్చేది. సంఘం లో సదరు మహిళ కుటుం బ సభ్యులు చెల్లించలేని పరిస్థితి ఉంటే ఇతర గ్రూపు సభ్యులే ఆ రుణ మొత్తాన్ని చెల్లించాల్సి రావ డం ఆనవాయితీ. ఈ అవస్థలకు గుర్తించిన ప్రభుత్వం వాటికి చెక్ పెడుతూ ఎస్‌హెచ్‌జీ మహిళలకు రుణ బీమాను (Loan insurance for SHG women) వర్తింపజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మహిళలకు జీవిత బీమాతోపాటు వారు పొందిన రుణాలపైనా బీమా వర్తింపజేసేలా చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది. సర్కార్ కసరత్తు చేస్తున్న ఈ సరికొత్త విధానం అమ ల్లోకి వచ్చాక రుణం తీసుకున్న మహిళ మరణిస్తే సంబంధిత రు ణాన్ని సదరు బీమా కంపెనీ చెల్లి స్తుందని అధికారిక వర్గాలు వెల్లడి స్తున్నాయి.
సదరు మహిళ కుటుం బానికి రూ. 10లక్షల మేర బీమా సొమ్ము అందుతుంది. రాష్ట్రంలోని 6.1లక్షల ఎస్‌హెచ్‌జీ (shg group) గ్రూపుల్లోని 61లక్షల మంది మహిళలకు బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎన్నికల కోడ్ (election code)ఉండ డంతో బీమా ప్రీమియం చెల్లింపు ప్రక్రియ చేపట్టలేదు. లోక్‌సభ ఎన్ని కలు ముగియడంతో ఎస్‌హెచ్‌జీ మహిళలకు జీవిత బీమాతోపాటు, వారు తీసుకున్న రుణాలకూ బీమా ను వర్తింపజేసేందుకు ప్రభుత్వం కస రత్తు చేస్తోంది. ఇందుకోసం బీమా కంపెనీతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సంబంధిత విభాగాలు తెలిపాయి. మరణించిన మహి ళ వివరాలను స్త్రీనిధి పోర్టల్ అప్ లోడ్ చేశాక 15 రోజుల్లోగా బీమా క్లెయిమ్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్య లు చేపట్టనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ వర్గాలు తెలిపా యి. దీంతో ప్రభుత్వ నిర్ణయం పట్ల స్వయం సహాయక సంఘాల మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.