–విధినిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
–నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
Sarat Chandra Pawar:ప్రజా దీవెన, నల్లగొండ: ఆపత్కాలంలో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులు, ఫిర్యాదిదారు లపట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్రపవార్ (Sarat Chandra Pawar:) అన్నారు. బధవారం మునుగోడు నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్ల ను (police station) సందర్శించి పోలీసుల విధినిర్వహణలో భాగం గా రికార్డులను పరిశీలించారు. నియోజకవర్గంలోని మునుగోడు చండూరు, నాంపల్లి, గట్టుప్పల మర్రిగూడ (Chandur, Nampally, Gattuppala Marriguda) పోలీస్ స్టేషన్లను ఎస్పీ సందర్శించి సిబ్బంది పనితీరు, పరిసరాలను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ స్టేషన్ కేసుల స్థితిగతులు, పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాం తాలు, శాంతిభద్రలు, సంఘ వ్యతి రేక కార్యకలాపాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లా డుతూ పోలీస్ స్టేషన్ లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటు లో ఉంటూ నేరాలను తగ్గించేందకు కృషి చేయాలని, కేసులను ఎప్పటి కపుపడు పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పని చేయా లని సిఐ, ఎస్ఐలను ఆదేశించారు.
ప్రతి రోజు రోడునడ ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ (Special drive) నిర్వ హించాలని దొంగదనాలు, దొమ్మీలు జరుగకుండా పగలు రాత్రి పెట్రో లింగ్ నిర్వహించాలని, సిసి కెమె రాలు ఏర్పాటు చేసుకునేలా ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లలో ప్రజ లకు, వ్యాపార సముదాయాల నిర్వాహకులకు అవగాహన పెంచా లని అన్నారు. ఆన్లైన్ సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త లపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలు (Non-social activities) జరుగకుండా అక్ర మ గంజాయి, పిడిఎస్ రైస్, జూదం లాంటి కార్యకలాపాలపై అనుని త్యం నిఘా ఏర్పాటు చేసి తనిఖీ నిర్వహించాలన్నారు. బ్లూకోర్ట్సు, పెట్రో మొబైల్ సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులోఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆవదలో ఉన్నవారిని తక్షణమే ఆదుకోవాలని అన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి బాధితులకు తగు న్యాయం జరిగే లా పోలీస్ సిబ్బంది పని చేయాలని సామాన్యుడు పోలీస్ స్టేషన్ కు (police station) వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేవిదంగా డ్యూటీలో అప్ర మత్తంగా ఉండాలన్నారు. ఈ కార్య క్రమంలో ఎస్పీ వెంట దేవరకొండ డిఎస్పీ గిరిధర్, చండూరు సిఐ వెంకటయ్య, నాంపల్లి సిఐ నవీన్ కు మార్, ఎస్ఐలు నురేష్, కె. రంగారెడ్డి, వెంకటేశ్వర్లు, గుత్తా వెంకట్ రెడ్డి, రామకృష్ణ, లచ్చిరెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది శంకర్ రెడ్డి, నరేందర్, సత్యం, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.