Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sharat Chandra Pawar: నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై చీటింగ్ కేసులు

–నల్లగొండ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ద్వారా నెంబర్ ప్లేట్ లేని 1769 వాహనాలు సీజ్
–నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్

Sharat Chandra Pawar:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నేర నియంత్రనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తం గా స్పెషల్ డ్రైవ్ (Special drive) నిర్వహించి వారం రోజులలో నెంబర్ ప్లేట్లు (Number plates) లేకుండా తిరిగే 1769 వాహనాలను పట్టు కొని సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ (Sharat Chandra Pawar) తెలిపారు. ఈ సంద ర్బంగా మాట్లాడుతూ జిల్లాలో నేరా లు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడే నేరస్తులు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను ఉపయో గిస్తున్నారని, నేరాల నియంత్ర ణ,చేధన కొరకు ఈ విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. ఇప్పటి నుండి జిల్లాలో నెంబర్ ప్లేట్లు లేకుండా గానీ,నెంబర్ ప్లేట్లు టాంపర్ చేసి గానీ ఎవరైనా పట్టుబడితే వారిపై చీటింగ్ కేసులను (cases of cheating) నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు వారు చేపడుతున్న చర్యలకు ప్రజలందరూ సహకరిం చాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

అధికారులను ఘనంగా సన్మానo ..జిల్లా పోలీసు శాఖలో (Police Department) సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తిస్తూ పదవి విరమణ పొందుతున్న యస్.ఐలు బి.యాదగిరి, యస్.నం దులాల్, ఏ.యస్.ఐలు యం.ఏ. ఖదీర్, యన్.వెంకటేశ్వర్లు, ఏ.ఆర్. యస్.ఐ యన్.నరసింహ రెడ్డి,హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ రావు, ఎల్.జి. యస్ పుల్లమ్మ లను జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా యస్.పి ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు (Police Department) అందించిన సేవలను కొని యాడారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ గౌరవమైన పోలీస్ శాఖ (Police Department)లో చేరి సుదీర్ఘ కాలం సేవలందిస్తూ పదవి విరమణ పొందడం చాలా అదృష్తం అని అన్నారు.మీ యొక్క సేవలు అనుభవాలు పోలీస్ శాఖ కు చాలా విలువైనవి అన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజం అని పదవి విరమణ అనం తరం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అన్నారు. మీ శేష జీవి తాన్ని కుటుంబ సభ్యులతో ఆనం దంగా గడపాలని రిటైర్మెంట్ అనం తరం మీరు అందరూ పోలీసు కుటుంబ సభ్యులు అని,ఎలాంటి సమస్యలు ఆపదలు ఉన్న ఎల్లవే ళలా అండగా ఉంటామని అన్నా రు. అనంతరం వారికీ అందవలసిన ఆర్దిక సదుపాయాలను (Water facilities) అందజేసి నారు. ఈకార్య క్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్,యస్.బి డిఎస్పీ రమేష్, ఏ.ఓ శ్రీనివాస్, సుపర్డెంట్ షబ్బీర్, ఆర్.ఐలు సూరప్ప నాయుడు, సంతోష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షు డు జయరాజు, సోమయ్య, సిబ్బం ది మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.