Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sickle cell anemia: సికిల్ సెల్ ఎనీమియా నివారించడమే లక్ష్యం

Sickle cell anemia: ప్రజా దీవెన, కోదాడ: సికిల్ సెల్ ఎనిమియా (Sickle cell anemia) దినోత్సవం సందర్భంగా, ఎస్ అత్మకూరు మండల పరిధిలోని నెమ్మికల్లు గిరిజన విద్యార్థుల వసతి గృహములో (Nemmikallu is a hostel for tribal students) మంగళవారం విద్యార్థులకు రక్త పరీక్షల శిబిరాన్ని (Blood test camp) నిర్వహించారు. విద్యార్థుల జీవితాలను సకదిద్దుకుందామని నినాదంతో యస్ అత్మకూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర (Primary Health Centre) ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి బంకా వీరేంద్రనాథ్ (Banka Virendranath) పాల్గొని మాట్లాడారు. గిరిజనులు ఎక్కువగా వంశపారంపర్యం గా ప్రతి నలుగురులోనూ ఒకరికి సికిల్ సెల్ (Banka Virendranath) లక్షణాలు వచ్చి రక్తహీనత ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని నివారించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషిచేసి ఆ లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి రేవతి ,సిహెచ్ఓ ఆవుల వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ రంగమ్మ ,వార్డెన్ లింగయ్య, ఆరోగ్య కార్యకర్తలు కొండల ,శ్రీను పుల్లమ్మ, ధనమ్మ, ఆశా కార్యకర్తలు సంధ్య మహాలక్ష్మి, విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు