Simha Vahini Bonalu: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ మహానగరంలో ఈనెల 28వ తేదీన ఆదివారం రోజున సింహ వాహిని అమ్మవారి బోనాల జాతర (Bonala Jatra) జరుగనుంది. దీని కోసం భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకు లు.ఈ నేపథ్యంలో నగరంలోని ప లు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను (Police traffic restrictions) విధించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేం దుకు ముందు నుంచే చర్యలు చేప ట్టారు. వాహనదారులు ఈ ఆంక్షల ను పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాల్లో సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని అధికా రులు సూచించారు.
ఆదివారం ఉదయం 4గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) అమ లులో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో లాల్ దర్వాజా నెహ్రు విగ్రహం నుంచి సింహవాహిని ఆలయం వైపు వాహనాలకు అనుమతి ఉండదని చెప్పారు.హిమాయత్ పురా, షంషీ ర్ పురా నుంచి వచ్చే వాహనాలు లాల్ దర్వాజ ఆలయం వైపు కా కుండా నాగులచింత వైపు వెళ్లా లని చాంద్రాయణ గుట్ట, ఉప్పు గూడ నుంచి వచ్చే వాహనాలు సైతం లాల్ దర్వాజ (Lal Darwaja)వైపు రాకుండా చత్రినాఖ అవుట్ పోస్ట్ వైపు మళ్లి స్తున్నట్లు చెప్పారు. పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడిం చారు. ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు భక్తులు నడుచుకోవాలని అధికారులు సూచించారు.