Southwest Monsoon 2026 : నైరుతి రుతుపవనాల జోరు.. తెలుగు రాష్ట్రాలకు వర్షాల శుభవార్త

Southwest Monsoon 2026: వేసవి వేడితో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఊరట కలిగించే సమాచారం అందించింది. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వేగంగా ముందుకు సాగుతుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలోని పశ్చిమ-మధ్య, ఈశాన్య ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. అలాగే ఈశాన్య భారత రాష్ట్రాల్లోనూ అవి మరింత చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఈ ప్రభావంతో మరో రెండు నుంచి మూడు రోజుల్లో తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు...