SP Sarath Chandra Pawar: ప్రజా దీవెన, దేవరకొండ: దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని చింత పల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిసరాలు, స్థితిగతులు గురించి యస్ఐ (si)ని అడిగి తెలుసుకుని, రిసెప్షన్, స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరి శీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందు బాటులో వుంటూ ప్రజల సమస్య లను తీర్చాలని, ప్రజా ఫిర్యాదు లలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ, భాదితుల కు తగు న్యాయం జరిగేలా పని చేయాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారుల తో మర్యాద పూర్వకంగా వ్యవహ రిoచి బాధితులకు తగు న్యాయం జరిగేలా పోలీస్ సిబ్బంది పనిచే యాలని, సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వస్తే తగు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలగజేసేల పని చేయాలని, అప్పుడే ప్రజలలో పోలీస్ శాఖ పైన నమ్మకం కలుగుతుంది అన్నారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మింస్తున్న పోలీసు స్టేషన్ పనులను పరిశీలించి నాణ్య తతో త్వరితగతిన ముగించాలని అన్నారు.అనంతరం పోలీసు స్టేషన్లో నిర్వహించిన మీట్ యువర్ ఎస్పి కార్యక్రమానికి మండల పోలీ సు స్టేషన్ పరిధిలోని విశేష స్పంద న వచ్చింది.జిల్లా ఎస్పి పిర్యాదా రులతో వారి సమస్యల పట్ల ముఖాముఖి మాట్లాడి, పరిశీలించి సత్వర పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
మారుమూల గ్రామాల్లోని ప్రజలు జిల్లా కేంద్రానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారని దీని కొరకు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిస్కరించుటయే ద్వేయంగా ఈ యొక్క ప్రోగాం ఏ ర్పాటు చేయడం జరిగిందని అన్నా రు.ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్లో మీట్ యువర్ ఎస్పి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట దేవరకొండ డి.యస్.పి గిరి బాబు, సి.ఐ నవీన్ కుమార్, యస్. ఐ యాదయ్య,పోలీస్ స్టేషన్ సిబ్బం ది ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
