Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sri Vasavi Kanyaka Parameshwari: కనుల పండువగా వాసవి కన్యకాపరమేశ్వరి జన్మదినోత్సవం వేడుకలు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా కోదాడ పట్టణంలో  కోదండ రామాలయంలో ఉన్న అమ్మవారి ఆలయం నందు శనివారం వేడుకలను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు.

ప్రజా దీవెన , కోదాడ : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి(Sri Vasavi Kanyaka Parameshwari) అమ్మవారి జన్మదినం సందర్భంగా కోదాడ పట్టణంలో  కోదండ రామాలయంలో(kodanda ramalayam) ఉన్న అమ్మవారి ఆలయం నందు శనివారం వేడుకలను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేకువ జాము నుండి సుప్రభాత సేవ, గణపతి పూజ, పంచామృత అభిషేకాలు, తీరొక్క పూలతో పుష్పాలంకరణ, లలితా సహస్రనామం, సాయంత్రం వేళలో పవళింపు సేవ వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తుల నడుమ వైభవంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో ఎత్తున పాల్గొని అమ్మవారి వద్ద కుంకుమ పూజలు నిర్వహించారు.

కాగా ఆలయానికి వచ్చిన భక్తులకు నాగు బండి. వీరయ్య, భద్రమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యర్ర. వెంకటనారాయణ జ్ఞాపకార్థం వేలాది మంది భక్తులకు(devotees) అన్నదానం కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొన్న కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి.చందర్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి, వంగవీటి. రామారావు,యర్ర భారతమ్మ, యర్ర. శ్రీనివాసరావు,జ్యోతి, చంద్రశేఖర్,అనూష,యర్ర వశిష్ట, గాయత్రి, విదిగ్న చారుహాసిని, పైడిమర్రి. వెంకటనారాయణ, దేవాలయ కమిటీ సభ్యులు గరిడేపల్లి. లక్ష్మణరావు, కానమర్లపూడి. శ్రీను,నాగభూషణం సత్య సాయి సేవా సమితి బృందం తదితరులు పాల్గొన్నారు.

Sri Vasavi Kanyaka Parameshwari Ammavari birth day