–కుటుంబ కలహాలతో ఆత్మహత్యా ప్రయత్నం
–అంతలోనే అప్రమత్తమై రక్షించిన జాలర్ల బృందం
Suicide Attempt: ప్రజాదీవెన, రాజమండ్రి: కొందరు చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వివాహిత (married woman) కుటుంబ కలహాలతో గోదావరిలో (godavari) దూకి ఆత్మహత్యకు యత్నించగా అక్కడి జాలర్లు ఆమెను రక్షించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా రాజమండ్రికి చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి (raliway bridge) వద్ద గోదావరిలో దూకింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు (police) వెంటనే స్పందించి అక్కడి జాలర్లను అప్రమత్తం చేశారు. వారు పడవపై వేగంగా వెళ్లి సదరు మహిళను రక్షించారు. జాలర్ల సాయంతో మహిళను రక్షించిన పోలీసులు ఆమెను స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, జాలర్లు సినిమా స్టైల్లో మహిళను రక్షించిన తీరుపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సకాలంలో స్పందించిన పోలీసులపై సైతం ప్రశంసలు కురుస్తున్నాయి. రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ (Two Town Police Station) ఎస్ఐ రత్తయ్య, కానిస్టేబుల్ లీలకుమార్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మహిళను జాలర్లు రక్షించిన వీడియో నెట్టింట వైరల్గా (viral) మారింది.
సినిమా స్టైల్లో పడవపై వేగంగా వచ్చి కాపాడిన జాలర్లు
రాజమండ్రి – కుటుంబ కలహాల నేపథ్యంలో రైల్ బ్రిడ్జి నుండి గోదావరిలోకి దూకిన వైనం దూడల నాగలక్ష్మి (40) అనే మహిళ.
పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందించి.. సదరు మహిళను జాలర్లు సహాయంతో కాపాడి , రక్షించి , స్టేషన్ కి తరలించి… pic.twitter.com/bled4iMeAL
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2024