Suryapatadistrictcollector : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేటజిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ ఆకస్మిక తనిఖీ, అంగన్వాడీ కేంద్రం,మినీ గు రుకుల పాఠశాలల సందర్శన
Suryapatadistrictcollector: ప్రజా దీవెన సూర్యాపేట: ఆ రోగ్య వంతమైన మహిళ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవా లని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. శుక్ర వారం ఆయన చివ్వేంల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం,మినీ గురుకుల పాఠశాలలను సంద ర్శించారు.పోషణ మాసం- 2025 కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు నిర్వహిస్తున్న మెన్స్ స్ట్రీమింగ్ కార్యక్రమంలో జిల్లా క లె క్టర్ చివ్వేంల మండల కేంద్రంలోని రెండవ అంగన్వాడి కేంద్రంలో నిర్వ హించిన కార్యక్రమంలో పాల్గొన్నా రు.
అధిక పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఇంట్లో ఉన్న పిల్లలకు, గ ర్భి ణీలకు, బాలింతలకు ప్రతిరోజు ఇచ్చేవిధంగా భర్తలకు, తండ్రు లకు అ వగాహన కల్పించాలని సూచించా రు. 5 సంవత్సరాల లో పు పిల్లలకు మెదడు అభివృద్ధి చెందే దశలో ఉంటుంది కాబట్టి మూడు నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఏమి నేర్పిస్తే భవి ష్యత్తు అంతా అదే గుర్తుంటుందని, నిర్లక్ష్యం చేయకుం డా వారికి మంచి పోషక ఆహారం ఇ స్తూ మంచి విషయాలు నేర్పిం చా లని సూచించారు.
ఆర్ బిఎస్ కే డాక్టర్లు పిల్లలకు ఆ రో గ్య పరిక్షలు చేస్తున్నారా, ఎంత మంది గర్భిణీలు, బాలింతలు ఉన్నారు అని కలెక్టర్ అడిగి తెలు సుకున్నారు. అంగన్వాడి పిల్లలతో వారి పే ర్లు, శరీర భాగాల పేర్లు, గ్రామం, జి ల్లా పేర్ల గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అం తకుముందు ప్రా థమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న స్వస్త్ నారీ -సుశక్ట్ పరిహార్ అభియన్ ( Swasth Nari Sashakt Pariv ar Abhiyaan) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
వైద్యాధికారులు క్షేత్రస్థాయి పర్యట న చేసినప్పుడు ఎనిమియా సమ స్యతో బాధపడుతున్న వారిని గు ర్తించి అంగన్వాడీల ద్వారా ప్రత్యేక పోషక ఆహారం అందే విధంగా చూడాలని సూచించారు. స్టాప్ హాజరు వివరాలు, ఏ యన్ సి రిజిస్టర్, మెడిసిన్స్ అదేవిధం గా హై రిస్క్ కేసెస్ వివరాలను అడిగి తెలు సు కున్నారు. ఈడిడి క్యాలెండరు పరి శీలించి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు జరిగేలా క్షేత్ర స్థా యి లో ఆశా కార్యకర్తల ద్వారా అవగాహన కల్పిం చాలని ఆదేశించారు.
అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ ( traibelwelfare) మినీ గు రు కుల బాలికల పాఠశాల సం దర్శించారు. ఈ సందర్భంగా రెండో త రగతి విద్యార్థలను తెలుగు సబ్జెక్టు చదివించగా చక్కగా చదవడం తో పాటు, రైమ్స్ వచ్చా అని అడగ గా, అభినయంతో సహా రైమ్స్ పాడడం తో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ బాగుంటుం దా? భోజనం మంచిగా పెడుతు న్నారా? అలాగే చదువు బాగా చెబుతున్నారా? అ ని విద్యార్థులను అడిగి తెలుసుకు న్నారు.స్టోర్ రూమ్ పరిశీలించారు.
కిచెన్ షెడ్ పనులను దసరా సెలవు లలోపు పూర్తి చేయాలని, అ లాగే ప్రాంగణంలో నిర్మిస్తున్న హాస్టల్ భవ నాలను త్వరగా పూర్తి చేసి అందు బాటులోకి తీసుకురావాలని, తర గ తి గదులలో సీలిం గ్ ఫ్యాన్లు, లైట్లు మరమ్మత్తులు చేయించాలని ఇంజనీరింగ్ అధికా రిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ప్ర కాష్ రావు, ఎంపీడీవో సంతోష్ కు మార్, మెడికల్ అధికారి భవాని, సిడిపిఓ శ్రీవా ణి, గురుకుల పాఠ శా ల ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఆర్ ఐ లు స్రవంతి, శ్రీను, పంచా యతీ కార్యదర్శి విక్రమ్, సూపర్వై జర్ సునీత,అంగన్వాడీ టీచర్లు ఇందిర, యమున తదితరులు పాల్గొన్నారు.