Tata Sumo: ఇటీవల భారతీయ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata)మరణించిన సంగతి అందరికి తెలిసిందే. రతన్ టాటా మృతి షాక్ నుంచి దేశం ఇంకా తేరుకోలేదు. కానీ రతన్ టాటా మాత్రమే కాదు, అంతకు ముందు చైర్మన్ అయిన వారు దేశానికి, సమాజానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. భారత ఆటో మార్కెట్‌ను శాసించిన టాటా సుమో కారుకు ఈ పేరు ఎలా వచ్చింది? సుమో పేరు జపనీస్ అని అనుకోవచ్చు. కానీ సుమోకు జపాన్‌కు ఎలాంటి సంబంధం లేదు. మరాఠీ వ్యక్తికి టాటా గ్రూప్ ఇచ్చిన గౌరవం ఇది. ఆ మరాఠీ వ్యక్తి పద్మ భూషణ్ సుమంత్ మూల్గావ్కర్. అతని పేరు మొదటి అక్షరాలతో సుమో అని పేరు పెట్టారు. టెల్కో, టాటా మోటార్స్ నిర్మాణానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది అని తెలుస్తోంది.
సుమంత్ మూల్గావ్కర్ 5 మార్చి 1906న ముంబైలో జన్మించారు. అతను ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ నుండి ఇంజనీరింగ్ చదివాడు. ఆ సమయంలో సుమంత్ మూల్గాంకర్ ఏసీసీ సిమెంట్‌లో ( ACC cement) వృత్తి రీత్యా పని చేసేవారు. ఈ క్రమంలో సుమంత్ మూల్గావ్కర్ 1949లో టాటా టాటా ఇంజినీరింగ్, లోకోమోటివ్ కంపెనీ(Engineering, Locomotive Company)అంటే టెల్కోలో ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా పని చేసారు. 1954లో అతను టాటా ట్రక్కుల తయారీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర వహించారు. 1966లో టెల్కో ప్రాజెక్ట్ ఏర్పాటు అయ్యింది. వారు టాటా ట్రక్కులకు గణనీయమైన మెరుగుదల చేశారు. అందుకే ఈ ట్రక్కులు కస్టమర్లకు ప్రాధాన్యతనిచ్చాయి. టాటా స్టీల్ వైస్ చైర్మన్‌గా కూడా విధులు నిర్వహించేవాడు.
సుమంత్ మూల్గావ్కర్ 1 జూలై 1989న మృతి చెందారు. అయితే టాటా గ్రూప్ (Tata Group) ఆయనను మరిచిపోలేదు. 1994లో టాటా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కారు మార్కెట్ లోకి వచ్చారు.అనంతరం ఆ కారుకు రతన్ టాటా (Ratan Tata) అతనిపేరు పెట్టినట్టు సమాచారం. అతని పేరులో మొదటి అక్షరం, ఇంటి పేరు మొదటి అక్షరాలతో కారుకు సుమో అని పేరు పెట్టినట్టు సమాచారం..