గ్రూపు 3 పరీక్షలకు సర్వ సన్నద్ధం..నేటి నుంచే ప్రారంభం
ప్రజా దీవెన, హైదరాబాడ్: తెలంగాణ గ్రూప్ -3 ఎగ్జామ్స్ కు ప్రభు త్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి ( filling jobs) నిర్వహించే గ్రూప్-3 పరీక్షలు ఆది, సోమవారాల్లో జరగనున్నాయి. మొత్తం 1388 పోస్ట్ లకు ఈ పరీక్ష ( exams) నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షలో సాధించిన మార్కులు ఆధారంగా ఉద్యోగం లభించనుం ది. ఈ పోస్ట్ లకు ఎటువంటి ఇంటర్వ్యూలు ఉండవు, కాగా తెలంగా ణ (telangana ) వ్యాప్తంగా మొత్తం 5.36 లక్షమంది అభ్యర్థుల కోసం మొత్తం 1,401 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష నిర్వ హణ బాధ్యతను జిల్లా కలెక్టర్లు, ఎస్పీల కు ప్రభుత్వం అప్పగించింది. గ్రూప్ 3 ఎగ్జామ్స్ ( group-3 exams) మొత్తం మూడు పేపర్లు మూడు సెషన్స్‌లో జరుగుతాయి.
*17 నుంచి గ్రూప్ 3 పరీక్షలు…*….ఆదివారం ( నవంబర్ 17) ఉద యం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, సోమవారం ( నవంబర్ 18) ఉద యం ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్షను నిర్వ హిస్తారు. గ్రూప్ 3 పరీక్షలు ఆఫ్‌లైన్ విధానంలో ఉంటాయి. ఒక్కో పేప రుకు 150 మార్కుల చొప్పున మొ త్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తా రు. రాత పరీక్ష ఆధా రంగానే ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండ దు. రాత పరీక్ష లను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మూడు భాషల్లో నిర్వ హిస్తారు.
*అభ్యర్ధులకు ముఖ్య సూచనలు* ….నవంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష ..మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. ఉదయం సెషన్‌లో 9.30 గంట లకు, మధ్యాహ్నం ( ofter noon) సెషన్‌లో 2.30 గంటలకు గే ట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు .హాల్ టికెట్లు ( holl tickets) అధికారికి టిజిపిఎస్ సి వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
హాల్ టికెట్‌పై ఫొటో లేకపోతే, దానిపై ఫొటో అంటించి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ధృవీకరించవలసి ఉంటుంది. ఇంకా పరీక్షా కేంద్రం లో డిక్లరేషన్ ఇ వ్వాల్సి ఉంటుంది. మూడు పాస్‌పోర్ట్ ఫోటోలను పరీక్షా కేంద్రానికి (exam centres) తీసుకెళ్లాలి.హాల్టికెట్లనే ఎ4 పేపర్ పై డౌన్ లోడ్ చేసుకోవాలి. బ్లూ లేదా బ్లాక్ పెన్ తో పాటు హాల్ టికెట్, ఒరిజినల్ గుర్తింపు కార్డు (పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటరుకా ర్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్సు ) తీసుకువెళ్లాలి.
మొదటి పరీక్షకు తీసుకెళ్లిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకూ తీసు కెళ్లాలి. పరీక్షల ఆనంతరం హాల్‌టికెట్ కాపీని, ప్ర శ్నాపత్రాలను (Questionnaires) భద్రంగా పెట్టుకోవాలి, ఉద్యోగంలో చేరే సమయంలో ఈ హాల్‌టికెట్ అవసరపడే అవకాశం ఉంది. ఎగ్జా మ్ పేపర్లో అన్ని ప్రశ్నలు ప్రింట్ అ య్యాయో లేదో చూసుకోవాలి, ఆ తరువాతే పరీక్ష రాయడం మొద లు పెట్టాలి.తప్పుడు పత్రాలతో హాజరైనా ఒకరి బదులు మరొకరు హాజరైనా డిబార్తో పాటు క్రిమి నల్ కేసులు నమోదు చేస్తామని సర్వీస్ కమిషన్ తెలిపింది.
Telangana groups exams