Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషా లతో ఉండాలని తిరుమల వెంక టేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు

తిరుమల పర్యటన లో సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, తిరుపతి:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషా లతో ఉండాలని తిరుమల వెంక టేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm revanth reddy) చెప్పారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్న అనoతరం తెలంగాణ(Telangana) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాల తో ఉండాలని తిరుమల శ్రీ వెంకటే శ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సంప్రదాయ దుస్తులు ధరించి భార్య, కూతురు, మనవ డు, అల్లుడితో కలిసి శ్రీవారికి ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయన కు ఘన స్వాగతం పలికారు. వైకుం ఠ ద్వారం గుండా శ్రీవారి ఆలయం లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకు న్నారు రేవంత్ రెడ్డి.

అంతకంటే ముందు ఉదయం తన మనవడి పుట్టెంటుకలను స్వామి వారికి సమర్పించి మొక్కులు చెల్లిం చుకున్నారు. శ్రీవారి దర్శనం అనం తరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా తో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం తో మంచి సత్సంబంధాలు కలగి ఉండాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించానని రేవంత్ చెప్పారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తమ వంతు సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సైతం సహకరిస్తుందని ప్రకటించారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రైతులు సంతో షంగా ఉన్నారని అన్నారు. సకాలం లో వర్షాలు కురవడంతో నీటి సమ స్యలు తీరాయన్నారు. స్వామివారి ఆశీస్సులతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకున్నానని సీఎం రేవంత్ చెప్పారు.
హైదరాబాద్ తిరుగు ప్రయా ణం…తిరుమల వెంకన్నను దర్శింvచుకున్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తిరుగుపయనం అయ్యారు. తిరు మల నుంచి రేణిగుంట విమానా శ్రయానికి బయలుదేరారు. రేణిగుం ట నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

Telugu states People happy says revanth reddy