Tet results: టెట్ ఫలితాలు విడుదల
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి విడుదల చేశారు.
అధికారులతో కలిసి రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను(Tet results released) ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) విడుదల చేశారు. హైదరా బాద్‌లో ఆయన ఈ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారని అధికా రులు తెలిపారు. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా, 57,725 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. పేపర్-2కు 1,50,491 మంది హాజరయ్యారని, వారిలో 51,443 అభ్యర్థులు అర్హత సాధిం చారని అధికారులు వివరించారు. పేపర్-1లో 67.13 శాతం, పేపర్ -2లో 34.18 శాతం మంది అర్హత సాధించారని అధికారులు పేర్కొ న్నారు. 2023తో పోలిస్తే పేపర్-1 లో 30.24 శాతం పేపర్-2లో 18. 88 శాతం ఉత్తీర్ణత పెరిగింద న్నా రు. కాగా, ఫలితాలను https:// schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటా యని అధికారులు వివరించా రు.
జీవితకాలం అర్హత… టెట్ అర్హత కాలపరిమితి(Tet Eligibility Time Limit) జీవితకాలం ఉంటుంది. పేపర్-1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి అయిదు తరగ తులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు, పేపర్-2కు అర్హత సాధించిన అభ్య ర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు(Eligible for School Assistant Jobs). మరోవైపు టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష అర్జీ ఫీజు తగ్గింపుపై నిర్ణయాన్ని ఎన్ని కల కమిషన్ అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో అర్జీదారులకు ఉప శమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుం ది. టెట్-2024లో అర్హత సాధించని వారికి వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది. అదేవిధంగా ఇప్పుడు అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీకి అప్లై చేసుకునే అవకాశాన్ని తెలంగాణ సర్కార్ ఇచ్చింది. డీఎస్సీ ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ విడుదల(Telangana Sarkar Notification release) చేసిన విషయం తెలిసిందే.
కొత్తవారికీ డీఎస్సీకి అవకా శం.. టెట్ ఫలితాల్లో కొత్తగా ఉత్తీ ర్ణులైన వారికి డీఎస్సీ(DSC) రాసే అవ కాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ దరఖాస్తు గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించిం ది. డీఎస్సీకి ఇప్పటివరకు దాదాపు 2.35 లక్షల మంది అర్జీ చేసుకు న్నారు. ఈ పరీక్షలు జులై 17 నుం చి 31 వరకు జరగనున్నాయి.
Tet results released