Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 8:22 am Posted by : praja deveena

Tragic Deaths in Bhadradri Kothagudem : బిగ్ బ్రేకింగ్, భద్రాద్రి కొత్తగూడెంలో గుండెల్ని పిండేసే విషాదం, వైద్యా ధికారుల నిర్లక్ష్యానికి బలైపోయిన తల్లిబిడ్డ

Tragic Deaths in Bhadradri Kothagudem : ప్రజా దీ వెన, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెంలో ఎంతో ఆశ గా ఆఇల్లాలు ‘అమ్మ’ అనే పిలుపు కోసం ఎదురుచూసింది. ఆ కుటుంబం అంతా కొత్తప్రాణం రాక కోసం వేయికళ్లతో నిరీ క్షించింది. కానీ, ప్రభుత్వ వైద్య రంగంలోని లొసుగులు, కొంద రు అధికారుల బా ధ్యతారా హిత్యం ఆనిరీక్షణను నిలువు నా పూడ్చేసింది. పురిటినొ ప్పులతో ఆసుపత్రి మెట్లెక్కిన ఓ యువతి, ఆమె గర్భాన పుట్టిన పసికందు. ఇద్దరూ వైద్యుల నిర్లక్ష్యనికి సజీవ సాక్ష్యాలుగా మారి అనంత లోకాలకు వెళ్లి పోయారు.భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

గుండాల మండలం శంభూనిగూడెం గ్రామానికి చెందిన వ నజ (20) అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుం బ సభ్యులు ఎంతో నమ్మకంతో గుండాల ప్రభుత్వ ఆ సుప త్రికి తరలించారు. కాన్పు స మయానికి ఆసుపత్రిలో ఉం డాల్సి న డాక్టర్లు ఒక్కరంటే ఒక్కరు కూ డా అందుబాటులో లేరు.పరిస్థితి విషమిస్తుండటంతో అక్కడ ఉన్న నర్సే స్వ యంగా కాన్పు చేయడా నికి సిద్ధపడింది. కానీ, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ ప్రయత్నం కాస్తా విక టించింది.

 

     ఒకే రోజూ రెండు మరణాలు

కాన్పు అయిన వెంటనే శిశువు అ పస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. కంగారుపడిన సిబ్బంది ఇల్లెందు ప్రభుత్వ ఆసు పత్రికి తరలించే లోపే ఆ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది. శిశువు అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించా రు.ఇటు బిడ్డను కోల్పోయిన నొప్పితో పాటు, కాన్పు తర్వా త వనజకు తీవ్ర రక్తస్రావం (Hemorrhage) మొదలైంది. ప రిస్థితి చేదాటిపోవ డంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ వనజ కూడా ప్రాణాలు విడిచింది.

    బాధిత కుటుంబం ఆక్రందన

సకాలంలో వైద్యం అంది ఉంటే మా బిడ్డ, మనవరాలు మా కళ్ల ముందే ఉండేవారు. ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోవడమే మా కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది” అంటూ వనజ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిర్ల క్ష్యం గా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేస్తున్నారు.

ప్రశ్నర్ధకంగా మారుతున్న గ్రామీణ వైద్యం

గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అండగా నిలవాల్సిన ప్ర భుత్వ ఆసుపత్రులు..ఇలా సిబ్బంది లే మితో, నిర్లక్ష్యంతో ప్రాణాలు తీసే యమపురులుగా మారుతుండటం ఆందోళ నకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండా లంటే వ్యవస్థలో మార్పుఎప్పుడు వస్తుంది? బాధ్యులపై చ ర్యలు తీసుకునేది ఎవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు మిగిలా యని చర్చ మాత్రం కొనసాగుతోంది.