–టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి
TS UTF State President Chava Ravi: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బ డులను కాపాడుకోవాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి పిలుపునిచ్చారు. ఆదివారం ప్ర భుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రచార జా తాను టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అ ధ్యక్షులు చావా రవి నల్లగొండ కేం ద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో జెం డా ఊపి ప్రారంభించారు. అక్కడ హాజరైన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాల మైన తరగతి గదులు , ఆటస్థలం ఉన్నాయని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల ల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశా రు. ప్రభుత్వ బడులను కాపాడాల్సి న బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్న దని తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2 పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకా లు, వర్క్ బుక్కులు, ఏకరూప దు స్తులు ఉచితంగా అందించబడుతు న్నాయని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు, రాగిజావ అందిస్తున్నార ని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల లను ఆదరించి పిల్లలను చేర్పించి, ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని, విద్యార్థుల సమగ్ర వికా సానికి ప్రభుత్వ పాఠశాలలు దోహ దపడుతాయని తెలియజేశారు.
ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తా రని, అత్యున్నత విద్యార్హతలు కలి గిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రు లకు వివరిస్తామని తెలియజేశారు. తల్లిదండ్రుల ఆశను ప్రైవేటు వి ద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుం టున్నారని,చదువుల నాణ్యతలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మ ధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని, సంపా దనలో సగానికి పైగా పిల్లల చదువు ల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థి తి ఏర్పడిందని, ప్రభుత్వ బడి మూ తపడితే సమాజానికి నష్టం అని, మన ఊరు – మనబడి, అమ్మ ఆద ర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌ ళిక వసతుల కల్పన మెరుగైందని తెలియజేశారు.
ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథ మిక తరగతులను ప్రారం భించటా నికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంద ని, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, లేబరేటరీ లతో పాటు ఆటపాటలతో అహ్లాదక రమైన వాతావరణంలో, ప్రతి వి ద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో, నిపు ణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుంద ని, పిల్లల మానసిక ఆరోగ్యానికి, వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్ర భుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుం టున్నాయని, మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించి బడికి అవ సరమైన వసతుల కల్పనకు ప్రభు త్వంపై ఒత్తిడి తెస్తే తప్పనిసరిగా బ డి నిలబడుతుందని తెలియజేశా రు.
పిల్లలకు నాణ్యమైన విద్య ఉచితం గా అందుతుంది. తల్లిదండ్రులకు ఫీ జుల భారం తగ్గుతుంది.ఈ ప్రచార జాతాలో ఎస్ ఓ కత్తుల రవీందర్, రాష్ట్ర కార్యదర్శి ఎం .రాజశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు బక్కా శ్రీనివాస్ చారి, పెరు మాళ్ళ వెంకటేశం, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, జి అరుణ, సరళ, వి .జగదీష్ బాబు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బద్రీనాథ్, మంగ్ల నాయక్, జిల్లా కార్యదర్శిలు గేరా నరసింహ, నల్లపరాజు వెంక న్న, పగిళ్ల సైదులు, కొమర సైదులు, ఎం . మురలయ్య, కె .మధుసూద న్, ఎర్ర నాగుల సైదులు, జానకి, సంధ్యారాణి, రవి, లక్ష్మీనారాయణ, రమణ, కృష్ణ, సయ్యదుద్దీన్, రా ములు రాజశేఖర్ రెడ్డి, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.